- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవీంద్ర భారతిలో.. 'యుద్ధనౌక' వర్ధంతి సభ
ప్రజా యుద్ధ నౌక 'గద్దర్' వర్ధంతి సభను.. ఈ రోజు రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభలో ప్రముఖ వక్తలు పాల్గొని గద్దర్ ను స్మరించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రజా యుద్ధ నౌక 'గద్దర్' వర్ధంతి సభను.. ఈ రోజు రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభలో ప్రముఖ వక్తలు పాల్గొని గద్దర్ ను స్మరించుకున్నారు. ఆయన పీడిత ప్రజల గొంతుకని, అతని పాటలే తూటాలని కొనియాడారు. గద్దర్ నడిపిన సాంస్కృతిక ఉద్యమ వారసత్వాన్ని తామూ కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రతిన చేశారు.
యుద్ధ నౌక.. భూస్వాముల అణచివేత, ప్రభుత్వ దోపిడీని, పాలకులను ధిక్కరించారన్నారు. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా అంటూ.. స్వరాష్ట్ర కాంక్షను మనలో రగిల్చారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డును సైతం తిరస్కరించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. నన్నూ గన్న తల్లూలార, తెలుగూ తల్లి పల్లేల్లారా అంటూ.. ప్రజలకు దగ్గరయ్యారని అన్నారు. ఈ కార్యక్రమానికి గద్దర్ కొడుకు సూర్యం, మీడియా అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారాయణ, ప్రొఫెసర్ హరగోపాల్, టీజేసీ మాజీ అధ్యక్షుడు కోదండరామ్, మా భూమి నరసింగరావు, పాశం యాదగిరి, నందిని సిద్ధారెడ్డి, గోరేటి వెంకన్న, అందెశ్రీ, చిక్కడు ప్రభాకర్, బుర్ర రాములు ఇంకా పలువురు వక్తలు పాల్గొన్నారు.






