తెలంగాణ పాఠశాలల్లో ‘నో బ్యాగ్‌ డే’

by Dishafeatures2 |
తెలంగాణ పాఠశాలల్లో ‘నో బ్యాగ్‌ డే’
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులకు పుస్తకాల భారాన్ని, ఒత్తిడిని తగ్గించేందుకు రాష్ర్టంలోని అన్ని పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబోధన అందించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లో ప్రతినెలా నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’గా పాటించనున్నారు.

28 రకాల కార్యకలాపాలు

ప్రైమరీ విభాగంలో షో టైమ్, ఫన్ స్టేషన్, క్రియేటివ్ సర్కిల్ అనే మూడు సెషన్లు ఉంటాయి. 1వ మరియు 2వ తరగతి విద్యార్థులు తమ కుటుంబం గురించి మాట్లాడడం, కుటుంబ సభ్యుల్లో ఒకరిలా నటించడం వంటి టాస్క్ ఉంటుంది. దీంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సృజనాత్మకతను పెంపొందించుకునే కుటుంబ సభ్యుని స్కెచ్‌ని గీయమని కోరతారు. వీటితో పాటు విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ఇందులో మ్యూజియంలు, చారిత్రక ప్రదేశాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల సందర్శనలు, సైన్స్ ప్రయోగాలు, డూడ్లింగ్, మోడల్ అసెంబ్లీ, మోడల్ ఎలక్షన్స్ వంటి ఇండోర్ కార్యకలాపాలు ఉంటాయి.

3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు

మూడు నుంచి ఐదు తరగతులు చదివే విద్యార్థులకు కార్యాచరణ ఆధారిత అభ్యాసంలో భాగంగా, జీవనోపాధిపై ఒక థీమ్‌ను అభివృద్ధి చేశారు. వృత్తిలో ఉపయోగించే పనిముట్లను గీయడం, నచ్చిన వృత్తిపై మాట్లాడడం, ఆ పనిని చేయడంపై అసైన్‌మెంట్ ఇస్తారు.

సెకండరీ స్థాయిలో

సెకండరీ స్థాయిలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కుటుంబ బడ్జెట్ సర్వే, పోస్ట్ ఆఫీస్, నిర్మాణ స్థలాలు, రేషన్ షాపుల సందర్శన, ఫీల్డ్ విజిట్‌లు, మోడల్ అసెంబ్లీ, మోడల్ ఎలక్షన్, అవుట్‌డోర్ మరియు ఇండోర్ కార్యకలాపాలు ఉంటాయి. సెకండరీ స్కూల్ స్థాయి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలు, దాని అప్లికేషన్లు, కెరీర్ అవకాశాలను సైతం పరిచయం చేయనున్నారు. పా శాలలు ఆరంభమై 12 రోజులు కావడంతో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉంది. జులై నుంచి కచ్చితంగా అమలు చేసేందుకు పాఠశాలల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.

Next Story

Most Viewed