Jubilee Hills: ఇండిపెండెంట్ల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు

by Prasad Jukanti |   (  Updated:2025-11-14 05:35:00  IST  )

జూబ్లీహిల్స్ ఫలితాల్లో అభ్యర్థులకు నమోదైన ఓట్లు ఆసక్తిని రేపుతున్నాయి.

Jubilee Hills: ఇండిపెండెంట్ల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో (Jubilee Hills bypoll counting) అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. బీఆర్ఎస్ అభ్యర్థిని అంతకంతకు వెనక్కి తోసుకుంటూ ఆధిక్యం కొనసాగిస్తోంది. ఈసీ వెబ్ సైట్ ప్రకారం రెండు రౌండ్‍ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉండగా, రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఉన్నారు. అయితే నాలుగో స్థానంలో నోటా కొనసాగడం ఆసక్తిగా మారింది. ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు పెద్ద ఎత్తున ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ వారందరి కంటే నోటాకే ఎక్కు ఓట్లు (NOTA votes) పోలయ్యాయి. 10 రౌండ్లు ముగిసే వరకు నోటాకు ఎన్ని ఓట్లు పోల్ అవుతాయో చూడాలి.

Read More..

Live Updates : బిహార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్

ఆ రెండు పార్టీలు మాపై దుష్ప్రచారం చేశాయి.. మంత్రి పొన్నం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story