15 నెలల్లో 612 చోట్ల పేదల ఇండ్లు నేలమట్టం.. నేడు హైడ్రాపై మాట్లాడుకుందాం: కేటీఆర్ ట్వీట్

by Ramesh Naini |

పేదల ఇళ్లపై బుల్డోజర్ నడుపుతూ, పెద్దల ఇళ్లకు మాత్రం చుట్టంలా మారిందని రేవంత్ సర్కార్‌ విధానాన్ని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా విమర్శించారు.

15 నెలల్లో 612 చోట్ల పేదల ఇండ్లు నేలమట్టం.. నేడు హైడ్రాపై మాట్లాడుకుందాం: కేటీఆర్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పేదల ఇళ్లపై బుల్డోజర్ నడుపుతూ, పెద్దల ఇళ్లకు మాత్రం చుట్టంలా మారిందని (CM Revanth Reddy) రేవంత్ సర్కార్‌ విధానాన్ని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సామాన్యులపై కర్కశ చర్యలు, అధికార వర్గాలపై సహన వైఖరి ప్రదర్శించడం రేవంత్ ప్రభుత్వానికి తగదని ఆయన మండిపడ్డారు. ‘సామాన్యుల ఇళ్లు నిరాక్షిణ్యంగా కూల్చివేస్తూ, బడా బాబులకు మాత్రం నెలల తరబడి గడువులు ఇస్తున్న రేవంత్ సర్కారు ఇదేనా ప్రజాపాలన?’ అని ప్రశ్నించారు. ‘15 నెలల్లో 612 చోట్ల పేదల ఇండ్లు నేలమట్టం చేశారు. కానీ అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ప్రభుత్వ పెద్దల అక్రమ నిర్మాణాలపై మాత్రం చర్యలు తీసుకోలేదు’ అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

‘ఇండ్లు కూల్చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమే ప్రజాస్వామ్యమా? ‘గరీబోంకొ హటావో’ అనేదే కాంగ్రెస్ సిద్ధాంతమా?’ అంటూ రేవంత్ రెడ్డి పాలనను ఆయన తీవ్రంగా విమర్శించారు. (Hydra) హైడ్రా పేరిట హైదరాబాదులో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న విధ్వంసం, అవినీతి, అక్రమాలపై మాట్లాడుకుందాం అని, తెలంగాణ భవన్‌ వేదికగా ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశంలో ప్రజల గోసను పరిగణనలోకి తీసుకుంటామని ట్వీట్‌లో తెలిపారు. ట్వీట్ కోసం క్లిక్ చేయండి..

Next Story