Tank Bund వద్ద ఆకట్టుకుంటున్న గణనాథులు

by Sathputhe Rajesh |   (  Updated:2022-09-09 13:40:32  IST  )

తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. నేడు హైదరాబాద్‌లో ని

Tank Bund వద్ద ఆకట్టుకుంటున్న గణనాథులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. నేడు హైదరాబాద్‌లో నిమజ్జనానికి గణనాథుల శోభయాత్ర జరుగుతుంది. వందల సంఖ్యలో నగరవాసులు గణనాథుల నిమజ్జనాన్ని వీక్షించడానికి ట్వాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు వినూత్న ఏర్పాట్లు చేశారు.

భారతదేశ 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలను పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ ఆకృతులతో మహాగణపతిని అంకరించారు. 75ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని తెలియజేసేలా ఒక చిన్న వాహనంపై గణనాథులతో పాటు స్వాతంత్ర ఉద్యమకారుల ఫోటోలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఇదే అట్రాక్షన్‌గా మారింది. నిమజ్జనానికి వచ్చిన వారంతా వీడియోలు, ఫోటోలు తీస్తూ..సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Next Story