- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TGPSC గ్రూప్-2,3 రిజల్ట్స్ పై కీలక అప్‌డేట్!?
తెలంగాణ(Telangana)లో గ్రూప్-1,2,3 పరీక్షల ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో గ్రూప్-1,2,3 పరీక్షల ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష(Group-2 Exams)లు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాల(Results) కోసం అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. పరీక్ష అటెండ్ అయిన అభ్యర్థులు కట్ ఆఫ్ మార్క్స్(Cut-off Marks), మెరిట్ జాబితా(Merit List) పై ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. 783 గ్రూప్-2 పోస్టులకు 5,51,855 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. 2,51,486 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
మొదటగా గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు..
ఈ క్రమంలో గ్రూప్–2 పరీక్షల ఫలితాల పై టీజీపీఎస్సీ(TGPSC) కసరత్తు చేస్తోంది. అయితే ముందుగా గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) జనరల్ ర్యాంకింగ్ జాబితా(General Ranking List)ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1 మెయిన్స్ రిజల్ట్‌కు అడ్డుగా ఉన్న లీగల్ చిక్కులు తొలగిపోయాయి. జీవో 29 పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు TGPSC కసరత్తు ప్రారంభించింది. దీంతో ఈ నెల 10వ తేదీలోగా గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్ననట్లు సమాచారం. అనంతరం గ్రూప్-2, 3 ఫలితాలను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్–1,2,3 పరీక్షలకు సంబంధించి 2,734 పోస్టులు భర్తీ కానుండగా.. 5,51,247 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
జాబ్ క్యాలెండర్ పై ఫోకస్..
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్(Job Calendar) పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ ఏడాది మే నుంచి కొత్త ఉద్యోగ ప్రకటనలకు TGPSC కసరత్తు చేస్తోంది.ఈ నెల 31వ తేదీ నాటికి అన్ని శాఖల్లో ఖాళీల సంఖ్యను అందజేయాలని తెలంగాణ సర్కార్‌కు లేఖ రాయనున్నట్లు రీసెంట్‌గా TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham) పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే(ఏప్రిల్) నెలలో ఈ అంశాలపై చర్చించి.. మే 1 నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తామని వెల్లడించారు.






