ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. PRC నివేదికపై అప్‍డేట్

by Prasad Jukanti |

సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. పీఆర్సీ నివేదిక, ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులపై కీలక అంశాలు చర్చకు వచ్చాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. PRC నివేదికపై అప్‍డేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పీఆర్సీ నివేదిక వీలైనంత త్వరలో తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ దిశలో కమిషన్ కూడా తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నివేదిక, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సర్వీస్ అంశాలు, ఉద్యోగుల బదిలీలు, 317 జీవో బదిలీలు, ఇతర అంశాలను సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ సమస్యలను వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సందర్భంగా సమావేశంలో ప్రస్తావించారు.

తగు చర్యలు తీసుకోండి:

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ డిజిటల్ హెల్త్ కార్డులను లాంఛనంగా ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సమావేశంలో ప్రస్తావించిన ఆర్థికేతర అంశాలను వీలైనంత మేరకు పరిష్కరించాలని ఉన్నతాధికారులను సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో, డైరెక్టరేట్ స్థాయిల్లో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఆధునీక టెక్నాలజీని వినియోగించుకొని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వివిధ సంఘాల నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో స్సెషల్ సీఎస్ మహేశ్ దత్ ఎక్కా, సవ్యసాచిఘోష్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తు, టీఎన్‍జీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీజీవో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Next Story