పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాల కోసం టీజీఐఎల్పీ అమలు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఇన్క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రాం (టీజీఐఎల్పీ)

పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాల కోసం టీజీఐఎల్పీ అమలు
X
  • సెర్ప్ సహాకారంతో స్వయం ఆదాయం పొందేలా చర్యలు
  • ఇప్పటివరకు 3,554 కుటుంబాల గుర్తింపు
  • టీజీఏఎల్పీ అమలుపై మంత్రి సీతక్కతో భేటీ అయిన బ్రాక్ ప్రతినిధుల బృందం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఇన్క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రాం (టీజీఐఎల్పీ) అమలుపై చర్చించేందుకు సచివాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో బ్రాక్ (బీఆర్ఏసీ) ప్రతినిధుల బృందం భేటీ అయింది. సెర్ప్ సహకారంతో ఆదివాసీలు, జోగినీలు, ఇతర పేద కుటుంబాల ఆర్థిక సాధికారత కోసం బ్రాక్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఎంపిక చేసిన పేద కుటుంబాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, ప్రోత్సాహకాలు, లోన్లు, రాయితీలు అందించి, వాటిని స్వయం ఆదాయం పొందే స్థాయికి చేర్చడమే తెలంగాణ సమ్మిళిత జీవనోపాది కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది

3,554 కుటుంబాల గుర్తింపు, శిక్షణ

టీజీఐఎల్పీ అమలు తీరుపై బ్రాక్ ప్రతినిధులు మంత్రి సీతక్కకు నివేదించారు. ఇప్పటివరకు మొత్తం 3,554 అత్యంత పేద కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. ఎంపిక చేసిన మండల మహిళా సమాఖ్యల ద్వారా 108 మంది నిపుణులను నియమించి లబ్ధిదారులకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా పేద కుటుంబాలకు దీర్ఘకాలికంగా ఆదాయం వచ్చే మార్గాలు కల్పించి, వారిని ఆర్థికంగా స్వావలంబన కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు బ్రాక్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. మంత్రి సీతక్కతో భేటీ అయినవారిలో గ్రెగరీ చెన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్వేతా బెనర్జీ (ఇండియా లీడ్), ఉషా రాణి (ప్రోగ్రాం లీడ్), వి. రమేష్ (సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్), అభిషేక్ (ప్రోగ్రాం అసోసియేట్) తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ కూడా పాల్గొన్నారు.

Next Story