పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాల అమలు.. మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |

మేము ఏ పథకాన్ని ఆపుతున్నామని చెప్పడం లేదని, పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తున్నామని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు.

పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాల అమలు.. మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: మేము ఏ పథకాన్ని ఆపుతున్నామని చెప్పడం లేదని, పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తున్నామని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Sessions) విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ (Twitter) లో పోస్ట్ చేశారు. దీనిపై ఆయన.. అప్పులు ఉన్నాయని తెలుసి ఆర్థిక వ్యవస్థీకరణ చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీకి (Congress Party) ఇవన్నీ పరిపాలించే అనుభవం ఉందని చెప్పారు. ఇన్ని కార్యక్రమాలు జరిగే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం (Union Government) పెద్దన్న లాగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం ఉండాలి కానీ ప్రభుత్వం మీదనే దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

అలాగే గత పాలకులు అందమైన భవనాలు కట్టి తెలంగాణ ఆర్థికంగా గొప్పగా ఉందని చూపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తాము ఎక్కడా తప్పించుకునే ప్రయత్నం చేస్తలేమని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇక బీజేపీ నాయకులు (BJP Leaders) మాట్లాడితే తులం బంగారం (Gold) గురించి మాట్లాడుతున్నారని, 15 లక్షల రూపాయలు ఇచ్చారా.. రైతులకు పెన్షన్ (Farmers Pension) ఇస్తామన్నారు.. రైతులకు ఉరి చట్టాలు తెచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేగాక బీజేపీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎన్ని ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే నిధులు కూడా వాపసు ఇచ్చే పరిస్థితి లేదు కానీ బాత్రూం మీద ఫోటో పెట్టాలని రేషన్ షాపు లో మీద ఫోటోలు పెట్టాలని అంటున్నారని దుయ్యబట్టారు. ఇక నిర్మల్ (Nirmal) నియోజకవర్గంలో 23,906 మంది రైతులకు 202.55 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని వివరించారు. రెండు లక్షల లోపు వరకు రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క నిర్మల్ నియోజకవర్గానికి 202 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిందని, దీని మీద చర్చ చేయడానికి నిర్మల్ కి రావడానికైనా సిద్ధంగా ఉన్నామని మంత్రి ఛాలెంజ్ చేశారు.

Next Story