- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిస్థితిపై నేషనల్ మెడికల్ కమిషన్ అసంతృప్తి
జిల్లాకో మెడికల్ కాలేజీ అంటూ ప్రారంభించిన ప్రభుత్వ వైద్య కళాశాలల పరిస్థితి ప్రమాదంలో పడేలా ఉంది. ప్రసిద్ధ కాకతీయ

దిశ తెలంగాణ బ్యూరో: జిల్లాకో మెడికల్ కాలేజీ అంటూ ప్రారంభించిన ప్రభుత్వ వైద్య కళాశాలల పరిస్థితి ప్రమాదంలో పడేలా ఉంది. ప్రసిద్ధ కాకతీయ మెడికల్ కాలేజీ తో సహా నూతనంగా ఏర్పాటు అయిన అనేక వైద్య కళాశాలల్లో నిబంధనల ప్రకారం సౌకర్యాలు సరిగా లేవంటూ, దీనిపై ఈనెల 18న ఢిల్లీలో కేంద్ర కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హెల్త్ సెక్రెటరీ తో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లను ఆదేశిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్. ఎం. సి) ఈనెల 13న లేఖ పంపింది. వీరితోపాటు లేఖలో పేర్కొన్న ఆయా కళాశాలలకు చెందిన బాధ్యులు వర్చువల్ గా హాజరుకావాలని పేర్కొంది. 2023 లో ఆయా కళాశాలల్లో జరిగిన తనిఖీల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు పేర్కొంది.
ఎందుకీ పరిస్థితి..
ప్రభుత్వ వైద్య కళాశాలలో సౌకర్యాలు సరిగా లేవంటూ ముఖ్యంగా అధ్యాపకుల ఆధార్ కి అనుసంధానం చేసిన బయోమెట్రిక్ ఆధారిత హాజరు తోబాటు... వైద్య విద్య స్థాయికి అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడంతో పాటు.. అటు సరైన టీచింగ్ ఫ్యాకల్టీ లేక, మరోవైపు వైద్య విద్యకు సంబంధించిన పూర్తిస్థాయి వసతులు లేవని నేషనల్ మెడికల్ కమిషన్ లేఖలో పేర్కొంది . ప్రాక్టికల్ కి సంబంధించిన మృతదేహాల దగ్గర నుండి ల్యాబ్ ఫెసిలిటీల వరకు స్టాండర్డ్స్ ని అందుకోలేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో 2025-26 సంవత్సరానికి గాను సీట్లపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
కాకతీయ మెడికల్ కాలేజీ కూడానా?
కొత్తగా వచ్చిన కాలేజీలన్నీ ఒక ఎత్తు అయితే ఏకంగా వైద్య విద్యకే కేంద్రమైన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఉన్న వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ సైతం ఈ లిస్టులో ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైద్య విద్యకి ఎంతో ప్రసిద్ధిగాంచిన కాకతీయ మెడికల్ కాలేజీ( కే ఎం సి) సౌకర్యాలు లేక లిస్టులో చేరడం వైద్య వర్గాల్లో ఆందోళనకు గురిచేస్తోంది.
ఇప్పుడెలా?
హడావిడిగా ప్రారంభించిన పలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు చేరి చదువు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో జరగనున్న విచారణకు హాజరైన రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు ఇలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాల్సి ఉంది. కాలేజీలు వచ్చింది గత ప్రభుత్వంలో కాబట్టి వారిచ్చిన సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా వారినే కారణంగా పేర్కొనడం... లేదా మరింత సమయం కోరి పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడంపై వివరణ ఇవ్వడం ఈ రెండే ఆప్షన్లుగా మిగిలాయి.
లేఖలో పేర్కొన్న కాలేజీలు ఇవే..
వరంగల్ లోని ప్రసిద్ధ కాకతీయ మెడికల్ కాలేజీ తో పాటు, ఖమ్మం,సంగారెడ్డి మహబూబ్నగర్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల్, రామగుండం, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి,కరీంనగర్, కొమురం భీం ఆసిఫాబాద్, మెహబూబాబాద్, మెదక్, ములుగు నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, కుత్బుల్లాపూర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట,జగిత్యాల, వనపర్తి లోని ప్రభుత్వ వైద్య కళాశాలలను లేఖ లో పేర్కొంటూ ఆ కాలేజీలో బాధ్యులు వర్చువల్ గా ఈనెల 18వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుండి 2:45 వరకు విచారణలో పాల్గొనాలని కమిషన్ కోరింది.






