ఉన్నత విద్యపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం : ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి

by Muthe.Rajitha |

గత ముప్పై ఏళ్లలో ప్రపంచీకరణ వల్ల ఉన్నత విద్య వ్యవస్థలో కొత్త ఒరవడుల వచ్చాయని , భారతదేశం జ్ఞానశక్తిగా ప్రపంచ అభివృద్ధికి తోడ్పడే సమయం ఆసన్నమైందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఉన్నత విద్యపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం : ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : గత ముప్పై ఏళ్లలో ప్రపంచీకరణ వల్ల ఉన్నత విద్య వ్యవస్థలో కొత్త ఒరవడుల వచ్చాయని , భారతదేశం జ్ఞానశక్తిగా ప్రపంచ అభివృద్ధికి తోడ్పడే సమయం ఆసన్నమైందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆధునిక ప్రపంచంలో ఉన్నత విద్యపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావాన్ని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) అకాడమిక్ ఎక్స్‌లెన్స్ సంస్థ (ఐఏఈ) సంయుక్తంగా జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమం గురువారం అన్లైన్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల పరిపాలన, అకడమిక్ ప్రణాళిక, ఫ్యాకల్టీ అభివృద్ధి, పరిశ్రమలతో భాగస్వామ్యంవంటి అంశాలు చర్చించారు. ఎన్ ఏఏస్ఈ, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మెరుగుపరిచే మార్గదర్శకాల పై చర్చించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ డబ్ల్యూటివో / జీఏటీటీ వంటి అంతర్జాతీయ ఒప్పందాల ప్రభావాన్ని విశదీకరించారు.

ప్రధాన అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ , డా. నిర్మల్జీత్ సింగ్ కల్సీ, బిట్స్ పిలానీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. రామ్‌గోపాల్ రావు, ఏఐసీటీఈ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎస్.ఎస్. మంత, నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సంద్యా చింతల ఐడిపీ రూపకల్పనకు సంబంధించి ఉత్తమ ప్రాథమిక పద్ధతుల అంశంపై ప్రసంగించారు. ఈ ఆన్‌లైన్ వర్క్‌షాప్‌లో 1000కి పైగా సంస్థల నుండి 1500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం నాలుగు సెషన్లలో 21 మంది వీసీలు, డీన్ లు, సీనియర్ ప్రొఫెసర్లు తమ విలువైన అభిప్రాయాలను తెలియజేశారు.

Next Story