- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DGP: మావోయిస్టులు లొంగిపోండి.. బాధ్యతలు స్వీకరించిన వెంటనే కొత్త డీజీపీ హాట్ కామెంట్స్
మావోయిస్టు సిద్ధాంతాలు ఆచరణలో విఫలం అయ్యయాని డీజీపీ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం లక్డికపూల్‍లోని డీజీపీ కార్యాలయంలో చార్జి తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన మావోయిస్టులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. పోరాట మార్గం వీడేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవల మావోయిస్టు పార్టీ పొలిటీ బ్యూరో సభ్యుడే లేఖ రాశారు. రష్యా, చైనాలో ఉన్న పరిస్థితులు భారత దేశంలో ఉన్న పరిస్థితులు వేరని వాటిని ఇన్నాళ్లు గుడ్డిగా అవలంభించామని ఇక పోరాటాన్ని ఆపేస్తామని అందులో పేర్కొన్నారని చెప్పారు. అందువల్ల మావోయిస్టు సిద్ధాంతాలు ఆచరణలో విఫలం అయ్యయాని తాము భావిస్తున్నామన్నారు. ఇకనైనా మావోయిస్టులు అజ్ఞాతం వీడి ప్రజల్లోకి రావాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
సోషల్ మీడియాలో పోస్టులపై కఠిన చర్యలు:
ఈ సందర్భంగా సోషల్ మీడియా పోస్టులపై డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో పిచ్చి పిచ్చి పోస్టులు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నకిలీ వార్తల ప్రచారం, వ్యక్తిత్వ హననం చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. తమకు రెడ్ బుక్, పింగ్ బుక్ తెలియవని తమకు తెలిసిందల్లా ఖాకీ బుక్(పోలీస్ బుక్) మాత్రమేనన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి చట్ట పరిధిలో విమర్శలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.






