- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దంచికొడుతోన్న ఎండలు..ఇవాళ ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఇవాళ భద్రాద్రి, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. నిన్న నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే జగిత్యాల, సూర్యాపేట, నిజామాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి జిల్లాలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మరో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇదే స్థాయిలో ఉంటుందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ భద్రాద్రి, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేసింది వాతావరణ శాఖ.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. శనివారం వరకు ఈ ఉధృతి కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45°C - 46°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. విజయ నగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 42°C - 44°C మధ్య ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉందట. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, రాయలసీమ జిల్లాలలో 40°C - 42°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.






