- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలోని ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు
రాబోయే 2-3 గంటల్లో తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అలర్జ్ జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరికొద్ది సేపట్లో జనగాం, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం (heavy rain) కురుస్తుందని ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. అలాగే గంటలకు 41 నుంచి 61 కి. మీ. ల వేగంతో గాలులు వీస్తాయని, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భార్షం పడే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ (IMD Alert) జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, జిల్లాల్లో రాగల రెండు మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ (Yellow alert) జారీ చేసింది. ఈ మేరకు అలర్ట్ జారీ అయిన జిల్లా యంత్రాంగం, అధికారులు సిద్ధంగా ఉండాలని ఐఎండి సూచించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాలను మేఘాలు కప్పివేయగా.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. అలాగే హైదరాబాద్ (Hyderabad) నగరంలో కూడా సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచించారు.






