హైదరాబాద్‌కు వాతవరణశాఖ హెచ్చరిక.. ఈ తేదీల్లో ఇళ్లలోనే ఉండండి

by Malleboina Mahesh |   (  Updated:2023-03-23 03:24:41  IST  )

హైదరాబాద్ మహా నగరంలోని ఆరు జోన్‌లకు భారత వాతావరణ శాఖ హెచ్చరీకలు జారీ చేసింది.

హైదరాబాద్‌కు వాతవరణశాఖ హెచ్చరిక.. ఈ తేదీల్లో ఇళ్లలోనే ఉండండి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహా నగరంలోని ఆరు జోన్‌లకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలకు IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా ఇటీవల కురిసిన చిన్నపాటి వానలకే రోడ్లపై వాహనాలు పడవలుగా మారిపోయాయి. దీంతో మార్చి 24, 25 తేదీల్లో బయటకు వచ్చే ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని.. అవసరం ఉంటేనే బయటకు రావాలని వాతావరణ శాఖ తెలిపింది.

Next Story