- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IMA తెలంగాణ సోషల్ మీడియా కమిటీ నియామకం
IMA తెలంగాణ సోషల్ మీడియా కమిటీ నియామకం

దిశ, తెలంగాణ బ్యూరో: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని, వైద్య రంగానికి సంబంధించిన అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వీలుగా ఐఎంఏ స్టేట్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సోషల్ మీడియా కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి.కిషన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2025-2026 సంవత్సరానికి గాను ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీకి అడ్వైజర్‌గా డాక్టర్ ఇ. విజయేంద్ర రెడ్డి (కరీంనగర్), చైర్మన్‌గా డాక్టర్ ప్రభు కుమార్ చల్లాగాలి (హైదరాబాద్) నియమితులయ్యారు. అలాగే కో-చైర్మన్లుగా డాక్టర్ ఎం. నాగిరెడ్డి (సైబరాబాద్), డాక్టర్ నులక రవీందర్ రెడ్డి (హాలియా సాగర్) బాధ్యతలు చేపట్టనున్నారు. కమిటీ సభ్యులుగా డాక్టర్ విశాల్ ఆకుల (నిజామాబాద్), డాక్టర్ బర్మా వెంకటేశ్వర్ రావు (కొంపల్లి), డాక్టర్ కె. రామ్ మూర్తి (సూర్యాపేట), డాక్టర్ ఐ. రవితేజ (నిజామాబాద్), డాక్టర్ కె. ప్రభాకర్ (భువనగిరి), డాక్టర్ కె. జయప్రకాశ్ రెడ్డి (నీలగిరి), డాక్టర్ జె. ప్రమోద్ రెడ్డి (మహబూబాబాద్), డాక్టర్ ఏ. సుధాకర్ (హుజూరాబాద్), డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ (సిర్పూర్ కాగజ్ నగర్), డాక్టర్ ఆర్. పెంటాచారి (గజ్వేల్) లు సభ్యులుగా నియమితులయ్యారు. వైద్య వృత్తి గౌరవాన్ని కాపాడుతూ, నకిలీ డాక్టర్ల నియంత్రణకు అవగాహన కల్పించడంతో పాటు ఐఎంఏ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతం చేస్తామని ఐఎంఏ స్టేట్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా ఎంపికైన డాక్టర్ ప్రభు కుమార్ చల్లాగాలి పేర్కొన్నారు.






