- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను అంత మంచోడిని కాదు.. అందరి పేర్లు రాసిపెట్టుకోండి : కేటీఆర్
తానైతే మంచోడిని కాదని, నెక్స్ట్ టైమ్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చెప్పినా వినబోనని, అందరిపేర్లు రాసి పెట్టుకుని మరీ వడ్డీతో చెల్లిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

దిశ, వెబ్‌డెస్క్: తానైతే మంచోడిని కాదని, నెక్స్ట్ టైమ్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చెప్పినా వినబోనని, అందరిపేర్లు రాసి పెట్టుకుని మరీ వడ్డీతో చెల్లిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల మల్కాజిగిరిలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ ల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన పార్టీ నాయకుల్ని కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకుల్ని వేధిస్తోన్న ప్రతిఒక్కరి పేరు రాసుకోవాలని సూచించారు. ఏసీపీలు, డీసీపీలు, సీఐలు, ఎస్సైలు.. ఇలా ఎవరెవరైతే బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారో వాళ్ల పేర్లు రాసి ఉంచాలని, నెక్స్ట్ టైమ్ కేసీఆర్ చేప్పినా వినబోనని, తానైతే మంచోడిని కాదని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ ధైర్యం కోల్పోవద్దన్నారు.
ఈనెల 15వ తేదీన మల్కాజ్ గిరి ఆషాఢమాస బోనాల చెక్కుల పంపిణీ సందర్భంగా అల్వాల్ లో కాంగ్రెస్ - బీఆర్ఎస్ ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మర్రి రాజశేఖర్ రెడ్డి రాగా.. బీఆర్ఎస్ వాళ్లకు సీట్లు లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్లే కూర్చోవడంతో గొడవ రాజుకుంది. ప్రస్తుత కార్పొరేటర్లకు స్టేజీపై కుర్చీలు లేకుండా మాజీ కార్పొరేటర్లకు సీట్లు ఇవ్వడంపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా.. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్పొరేటర్లపై దాడి చేశారు.






