మీకు 48 గంటల టైమ్ ఇస్తున్నా.. అధికారులకు బండి సంజయ్ హెచ్చరిక

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-08 07:57:50  IST  )

రామగుండం మున్సిపాలిటీ పరిధిలోని గోదావరిఖనిలో దారిమైసమ్మ ఆలయాల కూల్చివేత రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

మీకు 48 గంటల టైమ్ ఇస్తున్నా.. అధికారులకు బండి సంజయ్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: రామగుండం మున్సిపాలిటీ పరిధిలోని గోదావరిఖనిలో దారిమైసమ్మ ఆలయాల కూల్చివేత రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గోదావరిఖని నుంచి ఎన్టీపీసీ (NTPC) వరకు రోడ్డు వెంట ఉన్న 46 దారి మైసమ్మ ఆలయాలను అధికారులు తొలగించారు. బుధవారం రాత్రి ప్రారంభమైన ఆలయాల కూల్చివేతలు గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే దారి మైసమ్మ ఆలయాల కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సీరియస్ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 46 దారి మైసమ్మ ఆలయాలను అధికారులు ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. అయితే, రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను ఎందుకు వదిలేశారని ధ్వజమెత్తారు. హిందూ ఆలయాలంటే అంత చులకనా.. ఎంత ధైర్యమని కామెంట్ చేశారు. అధికారులకు 48 గంటల టైమ్ ఇస్తున్నానని కూల్చిన అన్ని దారి మైసమ్మ ఆలయాలను తిరిగి కట్టించాలని హెచ్చించారు. లేని పక్షంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చివేయాల్సిందేనని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు అవ్వగానే వచ్చేది గోదావరిఖనికేనని.. అధికారుల సంగతి తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు. దారి మైసమ్మ ఆలయాలను కట్టించకపోతే.. తానే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయిస్తానని అన్నారు. జరిగిన ఘటనపై ఆయన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ‌లకు ఫోన్ చేసి అధికారుల తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More..

Jubilee Hills: నాకు మనుషులే కనిపిస్తారు మతం కాదు.. ముస్లింలపై ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్

Next Story