- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jubilee Hills: నాకు మనుషులే కనిపిస్తారు మతం కాదు.. ముస్లింలపై ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్
జూబ్లీహిల్స్ బై పోల్ లో ముస్లిం చుట్టూ తిరుగుతున్న వేళ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీలో ముఖ్యమంత్రి పదవిపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatela Rajender) ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అనేది పార్టీ అనుకుంటే రాదని ప్రజల మద్దతు కూడా ఉండాలన్నారు. పార్టీ ఆలోచనకు ప్రజల ఆలోచన మ్యాచ్ అయితేనే ఆ పదవి వస్తుందన్నారు. తాజాగా ఓ చానల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈటల.. బీజేపీలో ఉంటే తనకు సీఎం పదవి వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ బీజేపీ ఓ జాతీయ పార్టీ అని అందులో ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలి, ఎవరి సేవలు ఎక్కడ ఉపయోగించుకోవాలో ఆ మాత్రం అవగాహన లేని పార్టీ కాదన్నారు. పదవుల మీద మమకారం తనకు లేదన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఎన్ని చేసినా గెలవలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. పార్టీ మారడం అంత ఈజీ కాదని మళ్లీ పార్టీ మారబోనన్నారు.
నాకు మతం కనబడదు:
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఓ ముస్లిం వ్యక్తి కాల్‍లో మాట్లాడుతూ తాను ముస్లిం అని అయితే ఈటల బీజేపీలో ఉన్నారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయినా తనకు ఈటల అంటే అభిమానం అని ఆయన ఆరోగ్యంగా ఉంటాలని కోరురుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తనకు మనిషి కనబడతారు తప్ప వారి మతం కాదన్నారు. జూబ్లీహిల్స్ బై పోల్ (Jubilee Hills by Poll) ప్రచారం ముస్లింల (Muslim Community) చుట్టూ జరుగుతుంటడం, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై తాను కామెంట్ చేయదలుచుకోలేదని ఈటల ఈ సందర్భంగా అన్నారు. అయితే ముస్లింలంటే అందరూ నవాబులు కాదనన్నారు. ముస్లింలు అంటే చాలా దురభిప్రాయం ఉందని వారిలో చాలా మంది కడుపేదరికలంలో ఉన్నారన్నారని చెప్పారు. కొంద మంది మాత్రమే ధనికులు ఉన్నారని దాదాపు 70 శాతం మంది పస్మాండా ముస్లింలే ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలు ముస్లింలకు ఇవ్వకుండా ఉంటామా అన్నారు. ఇలాంటి ప్రచారం చాలా బాధాకరం అన్నారు. నా ఇంటికి వచ్చేవారికి కులం, మతం, పార్టీ అడిగే అలావాటు తనకు లేదని వారి బాధలేంటో తెలుసుకుంటానన్నారు.
ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వమని మాట్లాడుతున్నారు. కానీ ముస్లింలు కూడా బీసీ-బిలో భాగం అనే విషయాన్ని చాలా మంది చెప్పలేకపోతున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. వీరికి తక్కువ మార్కులు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ బీసీ-బీలో ఉన్న ముస్లింలకు ఎక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు రావడం లేదన్నారు. ఈ దేశంలో రిజర్వేషన్లు లేని కులమే లేదన్నారు.






