- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇల్లీగల్ ఎఫైర్ చిచ్చు.. భార్య ప్రాణం తీసిన భర్త
by Prasad Jukanti |
వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను టవల్‌తో గొంతు బిగించి చంపేశాడో కిరాతక భర్త.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం బండ్లగూడలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భార్యను చంపేశాడో భర్త. నేతాజీనగర్‍లో మాన్ సింగ్, ఆర్తిదేవి (32) దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవల తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తన భార్య ఆర్తిదేవి పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో ఇవాళ టవల్‍తో ఆమె గొంతు బిగించి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రామచంద్రపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






