- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RMP: తుంగతుర్తిలో ఆర్ఎంపీల మాఫియా! యథేచ్ఛగా అబార్షన్‌లు.. ఓ సెంటర్ సీజ్‌తో విస్తుపోయే నిజాలు
తుంగతుర్తిలో పరిధిలో కొంత మంది ఆర్ఎంపీలు ఇష్టానుసారంగా చికిత్సలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Tungaturthi) తుంగతుర్తిలో పరిధిలో కొంత మంది ఆర్ఎంపీలు ఇష్టానుసారంగా చికిత్సలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తుంగతుర్తి మండలంలో కడుపు నొప్పితో వచ్చి మహిళకు చేసిన ఆబార్షన్ వికటించడంతో మృతి చెందిన ఘటన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దృష్టికి వచ్చింది. ఈ మేరకు ఆదివారం తుంగతుర్తి కి చేరుకున్న విచారణ అధికారి డా గుండగాని శ్రీనివాస్, డా విష్ణుల బృందం గర్భిణీకి చికిత్స చేసిన నకిలీ వైద్యుడు, ఆర్ఎంపీ శ్రీనివాస్ నిర్వహిస్తున్న అక్రమ ఆసుపత్రిపై విస్తుపోయే నిజాలు వెలుగు తీశారు. సదరు ఆర్ఎంపీ శ్రీనివాస్ గత కొన్ని ఏళ్లుగా ప్రభుత్వ అనుమతి లేకుండా సాయి బాలాజీ ఆసుపత్రి నిర్వహించడంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు గుట్టు చప్పుడు కాకుండా తన తోటి ఆర్ఎంపీలు కొందరితో కలిసి ఒక మాఫియా లాగా తయారు అయి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. అలాగే (Illegal abortions) గర్భ విచ్చిత్తిని అక్రమంగా కొన్ని ఏళ్ల నుంచి ప్రోత్సహిస్తునట్టు స్థానికుల నుంచి సమాచారం సేకరించారు.
నిందితుడు ఆర్ఎంపీ శ్రీనివాస్ పోలీసులు వెతికే పనిలో ఉన్నారని, ఇంకా ఎంత మందికి అబార్షన్‌లు చేసింది.. ఎంత మంది ఇతర ఆర్ఎంపీల పాత్ర ఇందులో ఉందని విచారణలో తేలనుందని డా జి. శ్రీనివాస్ తెలిపారు. గతంలో కూడా ఈ అక్రమ దందాపై స్థానికులు కొందరు జిల్లా వైద్యాధికారికి సమాచారం ఇచ్చిన కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. అపుడు సరైన చర్యలు తీసుకొని నేడు ఒక నిండు గర్భిణీ మృతి చెంది ఉండక పోవు అని తెలంగాణ వైద్య మండలి వైస్ చైర్మన్ డా జి. శ్రీనివాస్‌కి స్థానికులు తెలియజేశారు.
ప్రస్తుత సూర్యాపేట జిల్లా వైద్యధికారి డా చంద్రశేఖర్‌ని ఫోన్‌లో అధికారులు సంప్రదించారు. ఘటనపై గతంలో తన దృష్టికి ఫిర్యాదులు రాలేదని, ఇటీవలే ఇంచార్జీగా నియమితులై వచ్చానని జిల్లా వైద్యాధికారి తెలిపారు. అక్రమ గర్భ విచ్చిత్తి, ఇంజెక్షన్స్ వేయడం, ఆపరేషన్‌లు వంటి చికిత్సలు నిర్వహించే ఆర్ఎంపీలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని అధికారులకు జిల్లా వైద్యాధికారి హామీ ఇచ్చారు. సదరు ఆర్ఎంపీ శ్రీనివాస్‌పై ఎన్ఎంసీ చట్ట ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే అతని సెంటర్‌ను పోలీసులు సీజ్ చేశారు.






