- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sridhar Babu: టీ-చిప్‌తో గ్లోబల్ మ్యాప్‌పై తెలంగాణ
టీ-చిప్ ద్వారా తెలంగాణను గ్లోబల్ మ్యాప్‌పై నిలిపేందుకు సందీప్ కుమార్ మక్తాలా చేస్తున్న కృషి అభినందనీయమని.. ప్రతిభ నుంచి ఫ్యాబ్‌ల వరకు సమగ్ర ఎకోసిస్టమ్ నిర్మించాలన్న ఆయన దృష్టి సమయోచితమైందని రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రియల్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: టీ-చిప్ ద్వారా తెలంగాణను గ్లోబల్ మ్యాప్‌పై నిలిపేందుకు సందీప్ కుమార్ మక్తాలా చేస్తున్న కృషి అభినందనీయమని.. ప్రతిభ నుంచి ఫ్యాబ్‌ల వరకు సమగ్ర ఎకోసిస్టమ్ నిర్మించాలన్న ఆయన దృష్టి సమయోచితమైందని రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రియల్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్-2025లో మంత్రి పాల్గొని మాట్లాడారు. టీ-చిప్ కోసం తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. సమ్మిట్ ముగింపు సందర్భంగా టీ-చిప్ చైర్మన్ సందీప్‌కుమార్ మక్తాలా మాట్లాడుతూ.. 18 విశ్వవిద్యాలయాలు ముందుకొచ్చి, గ్లోబల్ లీడర్స్ తమ మద్దతు తెలిపి, ఐఐటీ హైదరాబాద్ తొలి చిప్‌ను ఆవిష్కరించడం గొప్ప పరిణామమని అన్నారు. సెమీకాన్ కానిస్టిట్యూషన్ ఇక ఆలోచన కాదని.. ఇది ఒక ఉద్యమమని వెల్లడించారు. తెలంగాణ ప్రారంభ వేదిక అని.. ఈ ప్రయాణం భారత్ నుంచి ప్రపంచానికి విస్తరించనుందని చెప్పారు.
రెండు రోజులపాటు చర్చల్లో చిప్ టాక్స్, ఎంఓయూ సంతకాలు, అవార్డులు, నెట్‌వర్కింగ్ సెషన్లు జరిగాయి. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల సెమీకండక్టర్ నిపుణుల కొరత, అందులో భారత్‌లోనే 85 వేల మంది నిపుణులు అవసరమని అంచనాలు వెల్లడయ్యాయి. అంతేకాకుండా భారత్‌లో సెమీకండక్టర్ రంగ భవిష్యత్తుకు మార్గం చూపే మొదటి సెమీకాన్ రాజ్యాంగం రూపకల్పనకు ఈ సదస్సు వేదికైంది. ఇందులో టాలెంట్, డిజైన్, మాన్యుఫాక్చరింగ్, అప్లికేషన్స్ అనే నాలుగు స్తంభాల వ్యూహంతో సమగ్ర ఎకోసిస్టమ్ రూపొందించడానికి ప్రతిపాదనలు ఆమోదించారు. నేషనల్ యంగ్ మింగ్ చియావ్ టంగ్ యూనివర్సిటీ, తైవాన్ సెమీకండక్టర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఏఆర్ఎం, జీయూసీ టెక్నాలజీ సీఈఓ సీసీ చాంగ్ తదితరులు పాల్గొని భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ స్వదేశీ చిప్‌ను ఆవిష్కరించింది. కాగా రెండో రోజు సమావేశానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సైతం హాజరయ్యారు.






