- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IIIT: బాసర ట్రిపుల్ ఐటీ ఉద్యోగుల ఆందోళన.. కళాశాల ముందే బైఠాయింపు
తమ డిమాండ్లను నెరవేర్చాలని బాసర(Basara) ట్రిపుల్ ఐటీ(IIIT) లో ఉద్యోగులు(Employees) ఆందోళనకు దిగారు.

దిశ, వెబ్ డెస్క్: తమ డిమాండ్లను నెరవేర్చాలని బాసర(Basara) ట్రిపుల్ ఐటీ(IIIT) లో ఉద్యోగులు(Employees) ఆందోళనకు దిగారు. నిర్మల్ జిల్లా(Nirmal District) బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్యోగులు నిరసన బాట పట్టారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు(Contract Asistant Professors) తమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కళాశాల ప్రధాన ద్వారాం ముందు బైటాయించి, ఆందోళన చేశారు. గత 15 సంవత్సరాల నుంచి ట్రిపుల్ ఐటీలో కాంట్రాలక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ లుగా విధులు నిర్వహిస్తున్నామని, అయినా మాపై ప్రభుత్వాలకు దయ కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం() తమని చిన్నచూపు చూసిందని, ఈ ప్రభుత్వం ఐనా మా బాధలు పట్టించుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆందోళన చేస్తూ సుమారు గంటసేపు ఎండలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు.






