- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళ్లు మొక్కాలి.. ప్రమాణం చేయాలి! కరీంనగర్‌లో కలకలం.. అధికారుల వింత వైఖరి
కరీంనగర్‌లో రెండు శాఖల అధికారుల తీరు వివాదస్పదంగా మారింది. అయితే నిబంధనలకు విరుద్దంగా పారిశుద్ధ్య కార్మికులతో ఇంట్లో పని చేయించుకుంటున్న మున్సిపల్ శాఖ అధికారిణి కార్మికురాలపై కక్ష సాధింపు ధోరణితో దొంగతనం అభాండం మోపగా అది నిజం కాకపోయినా సదరు అధికారిణి కోపం తగ్గేందుకు బాధితురాలితో కాళ్లు మొక్కించుకు కోగా ఆ నేరారోపణలలో పోలీసులు ఓ అమాయక కార్మికురాలిని అత్యుత్సాహంతో చితకబాదారు.

దిశ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్‌లో రెండు శాఖల అధికారుల తీరు వివాదస్పదంగా మారింది. అయితే నిబంధనలకు విరుద్దంగా పారిశుద్ధ్య కార్మికులతో ఇంట్లో పని చేయించుకుంటున్న మున్సిపల్ శాఖ అధికారిణి కార్మికురాలపై కక్ష సాధింపు ధోరణితో దొంగతనం అభాండం మోపగా అది నిజం కాకపోయినా సదరు అధికారిణి కోపం తగ్గేందుకు బాధితురాలితో కాళ్లు మొక్కించుకు కోగా ఆ నేరారోపణలలో పోలీసులు ఓ అమాయక కార్మికురాలిని అత్యుత్సాహంతో చితకబాదారు. ఈ విషయం మీడియాలో పతాక శీర్షిక వార్త కథనం రావడంతో ఇరకాటంలో పడ్డ పోలీసులు చేసిన ప్రయత్నం వివాదస్పదంగా మారింది. బాధితురాలిని తప్పుడు సమాచారం ఇచ్చావంటూ పోలీస్ స్టేషన్‌కు పిలిచిన సీఐ, నిన్ను పోలీసులు కొట్టారు అంటే ఎలా నమ్మాలి? నీవు మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు .నిన్ను ఎలా నమ్మాలి.. నువ్వు నమ్మిన దేవుడిపై ప్రమాణం చేయాలంటూ బాధితురాలికి హుకుం జారీ చేశారు. నీవు చెప్పింది నిజమైతే కొట్టిన వారిని సస్పెండ్ చేపిస్తా నీవు ప్రమాణం చేయి అంటూ ఆదేశించడంతో బాధితురాలు దేవుడి సాక్షిగా నన్ను పోలీసులు కొట్టారు అంటూ ప్రమాణం చేసింది. ఈ విషయం అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అధికారుల వింత వైఖరి పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివాదాస్పదంగా మారిన అధికారుల వింత వైఖరి
తన ఇంట్లో బంగారం దొంగిలించబడింది అంటూ పోలీసులను ఆశ్రయించిన కరీంనగర్ మున్సిపల్ అడిషనల్ కమిషనర్ బంగారం అపహరణకు గురయ్యాక వారం రోజులకు పోలీసులను అశ్రయించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతుండగా అధికారిణి ఫిర్యాదు ఇవ్వగానే కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిన పోలీసులు కేసు నమోదు చేయకుండానే ఓ కార్మికురాలిని పోలీస్ స్టేషన్ తరలించి చితకబాదడం వివాదాస్పదంగా మారింది. ఇక్కడ ఇద్దరు అధికారులు చట్టాన్ని వారి చేతిలోకి తీసుకుని వ్యవహరించడం మనం స్వతంత్ర దేశంలోనే ఉన్నామా.. అనే సందేహం కలిగిస్తుంది. అయితే మున్సిపల్ పారిశుధ్యం పనిచేసే కార్మికురాలిని తమ ఇంట్లో పనిచేయించుకోవడం పైగా కార్మికురాలిపై దొంగతనం ఆరోపణ చేయడం పోలీసులు చితకబాదాక తన కారులోనే బంగారం దొరికింది.. అంటూ ఫిర్యాదు వాపసు తీసుకోవడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం.. కాగా నేర నిర్థారణలో పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించకుండా కనీసం కేసు నమోదు చేయకుండా ఓ అభాగ్యురాలిని చితకబాదడం వివాదస్పదంగా మారి పోలీసు శాఖ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇద్దరు అధికారుల తీరుతో ఇప్పుడు పోలీస్ మున్సిపల్ శాఖల అధికారుల తీరు వివాదస్పదంగా మారి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి
అధికారిణి కనికరించాలి అంటే కాళ్లు మొక్కాలి
అభాగ్యురాలిపై చేయని నేరం మోపిన మున్సిపల్ అడిషనల్ కమిషనర్ కోపం తగ్గాలి అంటే బాధితురాలు కాళ్లు మెక్కాల్సిన దుస్థితి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. చేయని నేరం తన పై మోపొద్దు అంటూ బాధితురాలి లక్ష్మి కుటుంబ సభ్యుల సమేతంగా వెళ్లి తమ పొట్ట కొట్టకండి మేడమ్ అంటూ బాధితురాలు కాళ్లు మొక్కడంతో శాంతించిన అధికారిణి ఆమె కారులోనే బంగారం దొరికింది అంటూ ఫిర్యాదు వాపసు తీసుకోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మొదటి నుంచి బంగారం అపహరణకు గురైందా ? అనే సందేహాలు వ్యక్తం అవుతుండగా వారం రోజుల క్రితం అపహరణ గురైంది అంటున్న సదరు అధికారిణి వారం రోజుల తర్వాత ఫిర్యాదు చేయడం పై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కార్మికులపై తను చెప్పింది వినకపోడంతోనే అధికారిణి తన పవర్ చూపించేందుకు పోలీసులను వాడింది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి
స్టేషన్‌లో ప్రమాణం చేపించుకున్న పోలీసులు
నిజా నిజాలు తెలుసుకోకుండా పోలీసులు పారిశుధ్య కార్మికురాలిపై కర్కశంగా వ్యవహరించడం వివాదాస్పదంగా మారడంతో పోలీసుల వైఖరిపై దిశలో కథనం ప్రచురించగా దిశ కథనం తప్పు రాశారంటూ పోలీసులు బాధితురాలిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేశారు. అయితే నువ్వు చెప్పేది నిజమేనా అయితే ప్రమాణం చేసి చెప్పాలంటూ నీవు చెప్పింది నిజమైతే కొట్టిన వారిపై చర్యలు తీసుకుంటానంటూ బాధితురాలికి చెప్పడంతో భావోద్వేగానికి గురైన బాధితురాలు తను నమ్ముకున్న దేవుడి పై ప్రమాణం చేస్తూ పోలీసులు నన్ను కొట్టారు అని చెప్పింది. దీంతో పరిస్థితిని పసిగట్టిన పోలీసులు మేము కొట్టలేదు అని రాసి ఇక్కడి నుంచి వెళ్లాలంటూ ఆదేశించారు. చేసేది ఏమి లేక బాధితురాలు పోలీసుల సూచన కు తలొగ్గి పోలీసులు రాసిన పేపర్ పై బాధితురాలితో సంతకం తీసుకోవడం కొత్త వివాదానికి దారితీసింది
బాధితురాలిపై థర్డ్ డిగ్రీ అవాస్తవం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా పోలీసులు బాధితురాలిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని టూ టౌన్ సీఐ సృజన్ రెడ్డి తెలిపారు. ఓ ఫిర్యాదు పై తనను విచారించి పంపించాము. తిరిగి ఫిర్యాదు ఇచ్చిన వారు కేసు వెనక్కి తీసుకోవడంతో కేసును క్లోజ్ చేస్తున్నామని తెలిపారు.






