- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌కు ఓటేస్తే పంచాయతీలకు నయా పైసా రాదు.. బండి సంజయ్ సంచలన ట్వీట్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గ్రామ పంచాయతీలకు నయా పైసా రాదనేది స్పష్టమవుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గ్రామ పంచాయతీలకు నయా పైసా రాదనేది స్పష్టమవుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్‌లో జరిగిన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ ఉన్నత నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని, ‘X’ వేదికగా ఈ మేరకు ట్వీట్ చేశారు. సమావేశంలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై కరపత్రం కూడా విడుదల చేశారు. నవంబరు 26 నుంచి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే గ్రామ పంచాయతీలకు నయా పైసా రాదనేది స్పష్టమన్నారు. గ్రామ పంచాయతీల్లో జరిగే ప్రతి అభివృద్ధి పనికీ కేంద్రమే నిధులు ఇస్తోందనేది సత్యమని పేర్కొన్నారు. కాబట్టి ప్రజలంతా బీజేపీకి ఓటేస్తేనే గ్రామాలకు మరిన్ని నిధులు, మరింత అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేలా ప్రతి కాషాయ కార్యకర్తా పని చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.






