- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విదేశాలకు చదువుకోమని పంపితే.. హనీట్రాప్ దందాలు? వైరల్ మహిళ వీడియో కలకలం!
ఇటీవల కొందరు విద్యార్థులు చదువు పేరిట వెళ్లి డబ్బు కోసం అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: విదేశాల్లో ఉన్నత విద్య సాధించాలని భారతీయ యువతలో ఆసక్తి పెరుగుతోంది. మెరుగైన చదువు, మంచి జాబ్, స్థిరమైన భవిష్యత్తు కోసం వేలాది మంది విద్యార్థులు యూఎస్ సహా అనేక దేశాలకు వెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులు భారీ ఖర్చులు భరించి తమ పిల్లలను విదేశాలకు పంపుతున్నారు. అక్కడ మాస్టర్స్ చేస్తున్న విద్యార్థులు సాధారణంగా ఖర్చుల నిమిత్తం సూపర్ మార్కెట్లు, హోటళ్ళలో పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తూ చదువు కొనసాగిస్తారు.
అయితే, ఇటీవల కొందరు విద్యార్థులు చదువు పేరిట వెళ్లి డబ్బు కోసం అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా డల్లాస్, ఒహాయో ప్రాంతాల్లో మాస్టర్స్ స్టూడెంట్స్ హనీట్రాప్‌లుగా మారి ఎన్నారైలను వలలో వేసి, తర్వాత బెదిరింపులకు పాల్పడి డబ్బులు దోచుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఓ మహిళ విడుదల చేసిన వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. విదేశాల్లో చదువుకుంటున్న కొందరు అమ్మాయిలే ఈ రకమైన దందాలు చేస్తున్నారని, ఎన్నారై పురుషులు అపరిచిత మహిళలతో జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు. అమెరికాలో ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్‌గా మారిందని, ఎన్నారైలంతా ఇలాంటి అమ్మాయిల పట్ల జాగ్రత్త ఉండాలని ఆమె వీడియోలో పేర్కొన్నారు. వీడియో ఇదే..






