- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీ తమ్ముడిపై సిద్ధమైతే.. నా తమ్ముడిపై నేనూ సిద్ధం: రేవంత్‌కు హరీశ్ సవాల్
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అంటూ హరీశ్ రావు సవాల్ విసిరారు. మంత్రి పొంగులేటిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CM Revanth Reddy) తమ్ముడు చేసిన అవినీతిపై హౌస్ కమిటీ విచారణకు సిద్ధమైతే నేనూ మా తమ్ముడిపై హౌస్ కమిటీ విచారణకు సిద్ధం అని మాజీ మంత్రి, శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. హౌస్ కమిటీ వద్దు.. సీఐడీ విచారణ వద్దు.. ఇద్దరం కలిసి సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దామన్నారు. ఈ విషయంలో విచారణకు రేవంత్ రెడ్డికి దమ్ముందా అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ అవినీతి కి పాల్పడిందని అందరికీ అర్థం అయిందని, ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది కాబట్టి ముఖ్యమంత్రి ఎదురు దాడి చేస్తోందన్నారని ఆరోపించారు. సమాధానం లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఒక తప్పు కోసం పది తప్పులు:
ప్రభుత్వంలో అవినీతిని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు కాబట్టే ఆయన్ను బెదిరిస్తున్నారన్నారు. అసెంబ్లీలో నోటితో చెప్పలేని భాష మాట్లాడిన రేవంత్ రెడ్డిని ఎథిక్స్ కమిటీ ముందు నిలబెట్టాలన్నారు. మంత్రి తప్పు చేశారని అందరికీ అర్థం అయిందని మైనింగ్‍లో అవినీతిపై సీబీ సీఐడి కాదు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలంటున్నామన్నారు. పొంగులేటి మంత్రిగా ఉంటే విచారణ సజావుగా సాగదని అందుకే మంత్రిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కి 28 లక్షల పెనాల్టీ వేశారు. ఆ పెనాల్టీ కట్టలేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోలేదు. సభలో ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి పది తప్పులు చేశారన్నారు. 20 అంశాలపై విచారణ చేయించాలని స్పీకర్‍కు లేఖ ఇచ్చామని వీటిపైన సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలన్నారు. మైక్ కోసం నాలుగున్నర గంటల పాటు నిలబడ్డాము అయినా మైక్ ఇవ్వలేదన్నారు. పొంగులేటిపై హౌస్ కమిటీ వేసే ధైర్యం మీకు లేదన్నారు. రేపు ఉదయం తెలంగాణ భవన్ నుంచి మా కార్యాచరణ ఉంటుందని రేపు ఏమి చేయాలో మాకు ప్లాన్ ఉందన్నారు.






