దమ్ముంటే శాసనసభ రద్దు చేసి మళ్లీ ఎన్నికలకి రావాలి : ఎంపీ

by Taduka Kalyani |

ప్రజల సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా మోడీ 12 ఏళ్ల పాలన కొనసాగుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

దమ్ముంటే శాసనసభ రద్దు చేసి మళ్లీ ఎన్నికలకి రావాలి : ఎంపీ
X

దిశ, మెదక్ టౌన్ : ప్రజల సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా మోడీ 12 ఏళ్ల పాలన కొనసాగుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో మొట్ట మొదటి సరిగా 1952 లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగాయని, అంతకంటే ముందు ఓటు చోరీ, సీటు చోరీ చేసి దొడ్డిదారిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ అయ్యారని అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ప్రజల ఓట్లతో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా సేవ చేస్తున్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. జనధన్ ఖాతాలు, డిజిటలైజేషన్, జాతీయ రహదారుల విస్తరణ, రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, ఆ పార్టీ పాలనలో దేశ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. తెలంగాణలో సీఎం నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పెరుగుతుందని అన్నారు. సీఎం రేవంత్ ఏం చేశారని 8 మంది ఎంపీలు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. రేవంత్ మరోసారి అధికారంలోకి వస్తానని చెబుతున్న ఉత్తరకుమారుడి మాటలు నిజమైతే మేము 8 మంది ఎంపీ రాజీనామా చేస్తామని దమ్ముంటే శాసనసభ రద్దు చేసి మాతో పాటు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. అలాగే కాంగ్రెస్ పాలనలో దేశ మహనీయులకు తగిన గుర్తింపు లభించలేదని, వంటి నేతల సేవలను విస్మరించారని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం దేశ సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తోందని, రాబోయే రోజుల్లో మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ చీకోటి ప్రవీణ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి లు సురేష్, శ్రీనివాస్, ఈర్ల రంజిత్ రెడ్డి, మండల అధ్యక్షరాలు బెండ వీణ, కౌన్సిలర్స్ శంకర్ గౌడ్, పబ్బ రాజమణి, అఖిల, మహిళ మోర్చా నాయకులు కవిత రెడ్డి, మల్లికా, సంగీత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story