దమ్ముంటే దొంగ ఓట్లను బయటకు తీయాలి.. కాంగ్రెస్‌కు ఎంపీ డీకే అరుణ సవాల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-25 06:54:32  IST  )

తెలంగాణ (Telangana)లోనూ దొంగ ఓట్లు ఉన్నాయని.. ఆ ఓట్లతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలుపొందారని మహబూబ్‌నగర్ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) మధ్య మాటల యుద్ధానికి తెర లేపాయి.

దమ్ముంటే దొంగ ఓట్లను బయటకు తీయాలి.. కాంగ్రెస్‌కు ఎంపీ డీకే అరుణ సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లోనూ దొంగ ఓట్లు ఉన్నాయని.. ఆ ఓట్లతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలుపొందారని మహబూబ్‌నగర్ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) మధ్య మాటల యుద్ధానికి తెర లేపాయి. అసలు దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్‌ (Bandi Sanjay) గెలిచేవారు కాదని, బీజేపీలా తాము దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగలేదని మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్స్‌పై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాంటి ఓట్లతో గెలిచే అవవాటు హస్తం పార్టీకే ఉందన్నారు. ఓడిపోయినప్పుడు మాత్రమే కాంగ్రెస్‌కు ఫేక్ ఓట్లు గుర్తుకొస్తాయని క్లాస్ పీకారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 స్థానాలు గెలిచాయని.. దొంగ ఓట్లతో ఇది ఎలా సాధ్యమవుతోందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మధ్య నలిగిపోతూ.. మహేశ్ కుమార్ గౌడ్ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. దమ్ముంటే దొంగ ఓట్లను బయటకు తీయాలని సవాలు విసిరారు. ఓట్ల కోసం బీసీలకు కాంగ్రెస్ బీసీలను కాంగ్రెస్ నేతలు మభ్యపెడుతున్నారని తెలిపారు. బలహీనవర్గాలపై చిత్తశుద్ధే ఉంటే సీఎంగా రేవంత్ రెడ్డిని తప్పించి మహేశ్ కుమార్ గౌడ్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. మతిభ్రమించి, అధికారం తలకెక్కి కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More: TG: తెలంగాణలో ఓటు చోరీ వార్.. కాక రేపుతున్న బీజేపీ ఎంపీలపై టీపీసీసీ వ్యాఖ్యలు

Next Story