నువ్వు చేస్తే రాజకీయం, రేవంత్ చేస్తే వ్యభిచారమా..? కేటీఆర్ పై ఆటో డ్రైవర్ ఆగ్రహం

by Ramesh Goud |

కేటీఆర్ (KTR) నువ్వు చేస్తే రాజకీయం (politics).. రేవంత్ (Revanth) చేస్తే వ్యభిచారమా (adultery) అని, నువ్వు నీ అయ్య ఇంకెంత మందిని ముంచుతారని ఓ ఆటో డ్రైవర్ (auto driver) ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో (video) సోషల్ మీడియా (social media)లో వైరల్ (Viral)గా మారింది.

నువ్వు చేస్తే రాజకీయం, రేవంత్ చేస్తే వ్యభిచారమా..? కేటీఆర్ పై ఆటో డ్రైవర్ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్ (KTR) నువ్వు చేస్తే రాజకీయం (politics).. రేవంత్ (Revanth) చేస్తే వ్యభిచారమా (adultery) అని, నువ్వు నీ అయ్య ఇంకెంత మందిని ముంచుతారని ఓ ఆటో డ్రైవర్ (auto driver) ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో (video) సోషల్ మీడియా (social media)లో వైరల్ (Viral)గా మారింది. ఈ వీడియోలో ఓ సామాన్య ఆటో డ్రైవర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు (angry). ఆ ఆటో డ్రైవర్ మాట్లాడుతూ.. రేవంత్ ఓ రాబందు (vulture) అని, సీఎం నిర్ణయాల వల్ల ప్రజలు రోధిస్తున్నారని (people are crying) ట్విట్టర్ ట్విల్లు (Twitter Tillu) కేటీఆర్ మాట్లాడుతున్నాడని, మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం (BRS government's rule)లో ప్రజలు రోధించలేదా అని నిలదీశాడు.

ఈ రోజు ప్రభుత్వం ఫార్మా సిటీ (pharma city) కడుతుంటే ప్రజలు రోధిస్తున్నారని అంటున్నారు.. మరి మీ హాయంలో మల్లన్న సాగర్ (Mallanna Sagar), రంగనాయక సాగర్ (Ranganayaka Sagar) కట్టినప్పుడు ఎన్ని ఊర్లు రోధించాయో, ఎన్ని కుటుంబాలు రోధించాయో గుర్తులేదా అని మండిపడ్డారు. ఆ సమయంలో సీఎంగా ఉన్న మీ అయ్యకు తెలియదా ప్రజలు రోధిస్తున్న విషయం అని, అప్పుడు లేని రోధన ఇప్పుడు వచ్చిందా అని వ్యాఖ్యానించాడు.

అలాగే ఆ సమయంలో ఉన్న ఊరు, కన్న తల్లిని విడిచి వెళ్లలేక ఎంతో మంది రోధించారని, మీరు చేస్తే రాజకీయం, రేవంత్ చేస్తే వ్యభిచారమా అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కేటీఆర్ నీది నోరా.. మోరా.. అంటూ ఇంకా ఎంతమందిని మోసం చేస్తావ్ అని ఫైర్ అయ్యాడు. అంతేగాక ఆల్రెడీ నీ చాప్టర్ క్లోజ్ (chapter close) అయ్యిందని, నిన్ను ఎవరు నమ్మే పరిస్థితి లేదని అని చెబుతూ.. రేవంత్ దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌజ్ (farmhouse)లో పడుకున్నాడని, ఇక నీకెందుకు ఈ రాజకీయాలు అని సామాన్యుడు కేటీఆర్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు (sensational comments) చేశాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధిచిన ప్రస్తుతం వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు (Netizens) బిన్నంగా స్పందిస్తున్నారు.

Next Story