- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cylinders: డొమెస్టిక్ సిలిండర్‌తో దందా చేస్తే ఇక కటకటాలే!
రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత రాకుండా పౌరసరఫరాల శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత రాకుండా పౌరసరఫరాల శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. బ్లాక్ మార్కెట్ అమ్మకాలు జరగకుండా ప్రత్యేక తనిఖీ చేపట్టింది. బృందాలు ఏర్పాటు చేసి నిజమైన లబ్దిదారులకే పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టింది. డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్అధికారులు సోదాలు చేసి పలువురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. వంటింటి గ్యాస్ యాజమానులు కూడా అధిక ధరలకు విక్రయించాలని భావిస్తే ఉన్న గ్యాస్ కనెక్షన్ తొలగించాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. మధ్య పాశ్చ దేశాలతో యుద్ధం కారణంగా గ్యాస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ కొరత లేకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్ర పౌరసరఫరాల అధికారులు బ్లాక్‌మార్కెట్ అమ్మకాలపై తనిఖీలు చేపట్టడంతో గత 12వ తేదీ నుంచి ఈ నెల 3వ తేదీ వరకు గృహ అవసరాలకు వినియోగించే 3699 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
వీటితో పాటు చిన్న సిలిండర్ల కూడా 70 పట్టివేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న సిలిండర్ల విలువ రూ.1,10 కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా సిలిండర్లు అమ్మకాలపై చేసిన వారిపై 6 ఏ కేసులు 1275 నమోదయ్యాయి. వివిధ పోలీస్స్టేషన్లలో 216 ఎఫ్ఐ ఆర్లు కూడా ఉన్నట్లు వెల్లడించారు. అక్రమంగా సిలిండర్లు అమ్మి సొమ్ము చేసుకోవాలని కుట్రలు చేస్తే తగిన మూల్యం తప్పదని అధికారులు హెచ్చరించారు. వాణిజ్య అవసరాలకు హోటళ్లు, లాడ్జీల నిర్వహకులకు వంట గ్యాస్ సిలిండర్లను రూ. 1800 వరకు కొనుగోలు చేశారు. వాటిని సేకరించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి సిలిండర్‌కు రూ.500 ఇచ్చారు. వీరికి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల సిబ్బంది సహకరించడంతో బ్లాక్ దందా జోరుగా సాగింది. ప్రత్యేక బృందాలు తనిఖీలు చేయడంతో దందాకు ముక్కుతాడు పడింది.






