దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయండి.. ప్రభుత్వానికి కేటీఆర్ సంచలన సవాల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-09 13:21:56  IST  )

ఫార్ములా ఈ-రేసు కేసు (Formule E-Race Case)లో 9 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టిన ఏసీబీ (ACB) అధికారులు ఇవాళ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.

దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయండి.. ప్రభుత్వానికి కేటీఆర్ సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు కేసు (Formule E-Race Case)లో 9 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టిన ఏసీబీ (ACB) అధికారులు ఇవాళ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. కేసులో నిందితులుగా ఉన్న వారిపై చార్జిషిట్ దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం రిపోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు (CS Rama Krishna Rao) వద్దకు చేరింది. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ-రేసు కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను మొదటి నుంచి ఫార్ములా ఈ రేసు కేసు లొట్టపీసు కేసు అనే చెబుతున్నానని కామెంట్ చేశారు.

ఒకవేళ రేసు నిర్వహణలో అవకతవకలు జరిగి ఉంటే.. దమ్ముంటే సర్కార్ తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి మీడియా ఎదుటే లై డిటెక్టర్‌ టెస్ట్ చేయించాలని సవాల్ విసిరారు. అప్పుడు ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో తేలుంతుందని అన్నారు. చార్జిషీట్‌ అనేది ప్రొసీజర్‌లో ఓ భాగమేనని కొట్టిపడేశారు. ఫార్ములా ఈ-కార్‌ కేసు లొట్టపీసు కేసని.. ‘దూద్‌ కా దూద్.. పానీ కా పానీ’ అవ్వడం పక్కా అని అన్నారు. ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో ఒక్క రూపాయి కూడా ఎక్కడా తారుమారు కాలేదని, స్కాం లేదు మన్నూ లేదని కేటీఆర్ కామెంట్ చేశారు.

Next Story