- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓట్ల కోసం వస్తే హామీల గురించి అడగండి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఓట్ల గురించి ఎవరైనా వస్తే ఇచ్చిన హామీలు ఎమయ్యాయని నిలదీయండి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఓట్ల గురించి ఎవరైనా వస్తే ఇచ్చిన హామీలు ఎమయ్యాయని నిలదీయండి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) అన్నారు. నల్లగొండ జిల్లా (Nalgonda District)లో జరిగిన బీజేపీ సమావేశానికి (BJP Meeting) హాజరైన ఆయన.. ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. నల్లగొండ జిల్లాలో ఇవాళ జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల (Teacher MLC Election) కార్యశాలకు హాజరై, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ (Congress)కు ఓటు వెయ్యమని ఎవరైనా వస్తే, హామీల అమలు ఏమైందని ప్రశ్నించాలని చెప్పారు.
అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని, ఉపాధ్యాయుల, గ్రాడ్యుయేట్ల హక్కుల కోసం, వారి డిమాండ్ల పరిష్కారం కోసం నాడు, నేడు, భవిష్యత్తులో కూడా కొట్లాడేది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అంతేగాక తెలంగాణలో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి, హిందువులకు మరీ ముఖ్యంగా బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని గుర్తించాలని తెలిపారు. జాతుల మధ్య తేడాలను కూడా గుర్తించలేని దౌర్భగ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ముస్లింలను బీసీల జాబితాలో ఎలా చేరుస్తుందని ప్రశ్నించారు.
బీసీ సంఘాలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని, హిందువుల నిధులు, ఉద్యోగాలు, అవకాశాలు అన్నీ ముస్లింలకు కట్టబెడితే హిందువులు అడ్డుక్కుతినాలా రేవంత్ రెడ్డి అని, ఓవైసీలు బీసీలను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఏడాది కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని, స్కూళ్లలో చాక్ పీసులకు కూడా పైసల్లేని దౌర్భాగ్యం తెలంగాణలో ఉందని చెప్పారు. విద్యాశాఖకు ఇప్పటికీ మంత్రిలేని పరిస్థితి ఉందని, తెలంగాణలో విద్యావ్యవస్థ అర్బన్ నక్సల్స్ చేతిలో బంధీ అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యా కమిషన్ లో నక్సల్స్ భావజాలం ఉన్న వాళ్లకు చోటు కల్పించారని, గన్నుల పాలన కావాలా? పెన్నుల పాలన కావాలా? ఆలోచించుకోవాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.






