పాలన చేతకాకపోతే.. మా సూచనలు తీసుకోండి: సీఎం రేవంత్‌పై కొత్త ఫైర్

by Kema Shiva Kumar |

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kottha Prabhakar Reddy) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాలన చేతకాకపోతే.. మా సూచనలు తీసుకోండి: సీఎం రేవంత్‌పై కొత్త ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kottha Prabhakar Reddy) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నియోజకవర్గంలో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన అట్టర్‌ఫ్లాప్ అంటూ మండిపడ్డారు. పాలన చేతకాకపోతే.. తమ సూచనలు, సలహాలు తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో సీఎంను మార్చి కొత్త ముఖ్యమంత్రి తెచ్చుకోవాలని కాంగ్రెస్ (Congress) పార్టీకి ఆయన సలహా ఇచ్చారు.

అధికారంలోకి 18 నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయలేకపోయారని కామెంట్ చేశారు. ప్రతి మహిళకు రూ.2,500, ఆడిపిల్లలకు స్కూటీలు నీటి మూటలే అయ్యాయని ఎద్దేవా చేశారు. అన్ని హామీలు నేరవేర్చినట్లుగా.. తాజాగా యువతను బుట్టలో వేసుకునేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకం పేరుతో మరో డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని.. రాబోయే ఎన్నికల్లో భంగపాటు తప్పదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Next Story