- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి.. SIT నోటీసులపై హరీశ్‌రావు హాట్ కామెంట్స్
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ సీపీ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ సీపీ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ (KCR)తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావుకు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తారనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. రాష్ట్రంలో ‘సిట్’లు ఒక ప్రహసనం అయ్యాయని కామెంట్ చేశారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడింది కాబట్టి తనకు నోటీసులు ఇస్తారట అంటూ ఎద్దేవా చేశారు.
ఏ పోలీసు అధికారిని వదిలిపెట్టేది లేదు..
అసెంబ్లీ సమావేశాలు ముగిసే 3వ తేదీ సాయంత్రం నోటీసులు ఇవ్వమని చెప్పారని తనకు సమాచారం ఉందని హరీశ్ రావు అన్నారు. కొందరు అధికారులు తమ పోస్టింగుల కోసం అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో అందరూ చూశారని, రాజకీయ కక్షతో ఇబ్బంది పెడితే మీకు అదేగతి పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) మెప్పు కోసం అతిగా చేస్తే మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారని అన్నారు. తమకు త్యాగాల చరిత్ర ఉందని.. అరెస్టుకు భయపడేది లేదన్నారు. అరెస్టు చేస్తే చేసుకోండి.. రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని అన్నారు. అతిగా వ్యవహరిస్తున్న ప్రతి అధికారి పేర్లు బుక్‌లో నోట్ చేస్తున్నామని, అక్రమాలు, అరాచకాలు, సెటిల్‌మెంట్లు అన్ని రికార్డు అవుతూనే ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కువ చేస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని అన్నారు. చివరకు సర్వీసు నుంచి రిటైర్ అయినా.. విదేశాల్లో ఉన్నా, కేంద్ర సర్వీసులలో ఉన్నా తిరిగి రాష్ట్రానికి పట్టుకొస్తామని హరీశ్ రావు అన్నారు.
READ MORE ....
అర్ధరాత్రి హడావిడిగా CM ప్రెస్‌మీట్.. అదే కేసీఆర్ పవర్: హరీష్ రావు






