ఆదుకోవడానికి వస్తే దాడులా ? సునీతాలక్ష్మారెడ్డి

by Geesa Chandu |

వరద బాధితులను పరామర్శ కు వెళ్లిన బీఆర్ఎస్ నేతల పై దాడి చేయడం సిగ్గు మాలిన చర్య అని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.

ఆదుకోవడానికి వస్తే దాడులా ? సునీతాలక్ష్మారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరద బాధితులను పరామర్శ కు వెళ్లిన బీఆర్ఎస్ నేతల పై దాడి చేయడం సిగ్గు చేటని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. బురద రాజకీయం చేయొద్దన్న సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నదేమిటి ? రౌడీ రాజకీయమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోదు ..ప్రతిపక్షం ఆదుకునేందుకు ముందుకు వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తారా? అని నిలదీశారు. నేతల వాహనాలపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story