- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోరాటం కమ్యూనిస్టులదైతే ఆర్భాటం బీజేపీకెందుకు?
మ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన విరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో విషపురుగులైన కాషాయ ఉన్మాదులకు ఏమిటి సంబంధమని, మట్టి మనుషుల మహోన్నత పోరాట చరిత్ర గురించి మాట్లాడే నైతిక అర్హత మతోన్మాద బిజెపికి లేదని సిపిఎం జాతీయ నాయకురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు బృందాకరత్ విమర్శించారు.

పోరాటం కమ్యూనిస్టులదైతే ఆర్భాటం బీజేపీకెందుకు?
త్యాగాలు కమ్యూనిస్టులవి.. భోగాలు బీజేపీవా?
అబద్దాలతో చరిత్ర వక్రీకరిస్తున్న కాషాయ పార్టీ
సీపీఎం జాతీయ నాయకురాలు, మాజీ ఎంపీ బృందా కారత్
సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం- వాస్తవాలు -వక్రీకరణలు అనే అంశంపై సెమినార్
దిశ,సూర్యాపేట: కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన విరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో విషపురుగులైన కాషాయ ఉన్మాదులకు ఏమిటి సంబంధమని, మట్టి మనుషుల మహోన్నత పోరాట చరిత్ర గురించి మాట్లాడే నైతిక అర్హత మతోన్మాద బిజెపికి లేదని సిపిఎం జాతీయ నాయకురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు బృందాకరత్ విమర్శించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాలి వీరభద్రయ్య ఫంక్షన్ హాల్ లో సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం- వాస్తవాలు -వక్రీకరణలు అనే అంశంపై నిర్వహించిన సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 1946 సెప్టెంబర్ 11 నుండి 1951 సెప్టెంబర్ 17 వరకు జరిగిన విరోచిత వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లో మచ్చుకైనా కనిపించని మతోన్మాదులు ఆ పోరాటానికి వారసులమంటూ సభలు పెట్టడం విడ్డూరంగా ఉంద అన్నారు. 1913లో హిందూ మహాసభ 1925లో ఆర్ఎస్ఎస్ 1951 లో జనసంఘ్ ఏర్పడితే ఆ పోరాటం జరిగిన కాలంలో మీరు ఎందుకు ఆ పోరాటంలో పాల్గొనలేదని ప్రశ్నించారు. నైజాం తెలుగు మాట్లాడకూడదు అంటూ ఉర్దూ మాత్రమే ఉండాలని చెప్పిన్నట్లుగానే నేడు బిజెపి హిందీ మాత్రమే మాట్లాడాలి అని మాతృభాష మాట్లాడకూడదు అంటూ చెబుతుందన్నారు. నైజాం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మధ్యల అవినాభావ సంబంధం ఉందన్నారు.
విస్నూర్ రామచంద్రారెడ్డి, ఎర్రబాడు దొరలు, భూస్వాములు,జాగిర్ధరులు నిజాం సైన్యంలో అత్యధికలు తెలంగాణ గడ్డలోని మట్టి మనుషులను నానా చిత్ర హింసలు పెట్టారని దోపిడీ చేశారని చెప్పారు. విస్నూర్ రామచంద్రారెడ్డిది ఏ మతమని ప్రశ్నించారు. అది హిందూ, ముస్లింల పోరాటం కాదని దోపిడీ చేసిన దోపిడీదారులు, దోపిడీ కి గురైన పేదలు కూడా హిందువులేనని చెప్పారు. దోపిడి, పీడనకు వ్యతిరేకంగా తిరుగుబాటు అని చెప్పారు. ముస్లిం, నైజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో ఈ మట్టి గడ్డమీద పుట్టిన మైనార్టీ లైన ముస్లింలు ప్రాణ త్యాగాలు చేశారని చెప్పారు. ముగ్ధుమ్ మోహిణునుద్దీన్ అలంకుంద్ మీరి కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించారని షోయబుల్లాఖాన్ సీనియర్ జర్నలిస్టుగా ఇమ్రేజ్ అనే పత్రిక నడిపించి నైజాం నిరంకుశ చర్యలను ఎండగడుతూ కథనాలు రాశాడని, నిలబెట్టి కాళ్లు చేతులు నరికి కాచిగూడ రైల్వే స్టేషన్ లో చిత్రహింసలు పెట్టింది ముస్లిం రజాకారులు కాదాఅని ప్రశ్నించారు. ఆ పోరాటంలో మొదటగా ప్రాణాలు ఇచ్చింది షేక్ బందగీ ముస్లిం కాదాఅని చెప్పారు. ఆ ఉద్యమంలో అడుగడుగున ముస్లింలు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. మూడువేల గ్రామాలను విముక్తి చేసి గ్రామ రాజ్య కమిటీ ఏర్పాటు, చేసి 10లక్షల ఎకరాల భూములు పంచి 4000 మంది అమరులైన విరోచిత పోరాట గాధ అని కొనియాడారు. ఆర్ఎస్ఎస్ బిజెపి హైజాక్ చేస్తామంటే చరిత్ర క్షమించదని చెప్పారు. నిజాం రాజైన మీరు ఉస్మాన్అలీ ఖాన్ కు రాజ్య ప్రముక్ ప్రకటించి కిరీటం పెట్టింది నెహ్రు పటేల్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రాజాకార్ సైన్యాధిపతిగా ఉన్న ఖాసిం రజ్విని రహస్యంగా పాకిస్తాన్ కు పంపింది ఎవరో చెప్పాలన్నారు. కమ్యూనిస్టుల పోరాట వారసత్వాన్ని ఈ తరానికి అందించకుండా దానిని మతంరంగు పులిమి యువతరాన్ని తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే...
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
తెలంగాణ సాయుధ పోరాట వాస్తవ చరిత్ర వారసులు ముమ్మాటికి కమ్యూనిస్టులేననిచెప్పారు. తెలంగాణ గడ్డలో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా భవిష్యత్ లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నెహ్రూ పటేల్ కలిసి కమ్యూనిస్టులను అణిచివేయడానికి సైన్యాన్ని పంపారే కానీ నైజాంకు వ్యతిరేకంగా పటేల్ సైన్యాలు రాలేదని రంగారెడ్డి చెప్పారు.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విద్యార్థులు యువతరం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని వాస్తవ చరిత్రను వంట పట్టించుకోని మతోన్మాదులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.కులం మత ఉన్మాదాలను తలనాడి పీడిత వర్గాన్ని ఏకం చేసిన వర్గ పోరాటం వీర తెలంగాణ సాయుధ పోరాటమనికెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు అన్నారు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో మహిళలు ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు పరిమిత చదువులున్న రోజుల్లోనే మహిళలు తుపాకీ పట్టి రజాకార సైన్యాలకు విసునూర్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర నాటి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టులదేనని అని చెప్పారు.
నాడు కమ్యూనిస్టులు పంచిన పది లక్షల ఎకరాల భూమిలో నేడు పాలకులు సుమారు మూడు లక్షల ఎకరాల భూమిని వివిధ రూపాలలో స్వాధీనం చేసుకున్నారని చెప్పారు ఈ పోరాటం ద్వారా భూసంస్కరణ చట్టం, రక్షిత కౌలుదారి చట్టం ఏర్పడిందన్నారు. నేడు దళితులకు అసైన్డ్ భూములు ఇచ్చినప్పటికీ అవి వారి చేతుల్లో లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అసైన్డ్ భూములు ఉన్న దళితులందరికీ తక్షణమే పట్టాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు దున్నేవానికి భూమి కావాలని నాటి పోరాట నినాదం నేటికీ అనుసరణీయమేనని చెప్పారు. కుల వివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం భూమి కోసం ప్రకృతి వనరుల సాధన కోసం అట్టడుగు వర్గాలు ఐక్యంగా ఉద్యమించాలన్నారు మహోన్నత చరిత్ర గురించి మతోన్మాదులకు మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు.
సాయిధ పోరాటానికి మతం రంగు పూస్తున్న బీజేపీ
మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు
దున్నేవానికి భూమి కావాలని వెట్టి చాకిరి అంతం చేయాలని జరిగిన మహత్తర పోరాట వారసత్వం కమ్యూనిస్టులదేనని అన్నారు. చాలామంది నేటితరం విద్యార్థులు యువకులలో కెసిఆర్ కాలంలో జరిగిన తెలంగాణ పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటం ఒకటి కాదన్నారు నాటి పోరాటం ప్రపంచ చరిత్ర పుటల్లో సజీవంగా నిలుస్తుందన్నారు ఆ పోరాటంలో కమ్యూనిస్టులు రాత్రిపూట బడులు గ్రంథాలయాలు అక్షరాస్యత ఉద్యమాన్ని నిర్మించారని చెప్పారు ఆ పోరాటం కుల పీడనకు వ్యతిరేకంగా పీడిత వర్గాన్ని ఏకం చేసిందని చెప్పారు.ఆ పోరాటం అనేక రకాల పన్నులు రద్దుచేసిందని చెప్పారు. కమ్యూనిస్టుల చేతుల్లోకి అధికారం పోతుందనే భయంతో నెహ్రూ పటేల్ కలిసి రజాకార సైన్యాల ముసుగులో కమ్యూనిస్టుల పైన దాడులు దౌర్జన్యాలు చేశారని చెప్పారు. విరోచిత త్యాగాలు చేసిన అనేకమంది కమ్యూనిస్టు యోధుల ఆశయాలు కొనసాగించాలన్నారు.
అనంతరం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న పారేపల్లి వెంకయ్య, కలగాని సోమయ్య, దండిగా రాములు, కృష్ణమూర్తి, బాబు సాహెబ్, గంట రాఘవరెడ్డి, నాతి సోమక్క లను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, ఐద్వా రాష్ట్ర నాయకురాలు ఆశలత, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, పారేపల్లి శేఖర్ రావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






