ఇకనైనా సర్కారు తీరు మారకపోతే.. జనమే తరిమికొడతరు!.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

by Ramesh Goud |

కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని, ఇకనైనా ఈ సర్కారు తీరు మారకపోతే, జనమే కాంగ్రెస్ ను తరిమికొట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

ఇకనైనా సర్కారు తీరు మారకపోతే.. జనమే తరిమికొడతరు!.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని, ఇకనైనా ఈ సర్కారు తీరు మారకపోతే, జనమే కాంగ్రెస్ ను తరిమికొట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్లగొండ మున్సిపాలిటీ వాటర్ ట్యాంకులో మృతదేహం ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు. ప్రజల ప్రాణలతో చెలగాటం ఆడే పాలన అని, కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు.. కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరని ఆరోపించారు. కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరు.

చివరికి నల్గొండలోని నీటిట్యాంకులో పదిరోజులుగా శవం ఉన్నా నిద్రలేవరని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సాగర్ ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే, కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం.. అదే నిర్లిప్తత అని, సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారు.. ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకంతో దశాబ్దాల తాగునీటి తండ్లాటను తీరిస్తే.. కనీసం నీటిట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. అంతేగాక జలమే జగతికి మూలమని గుర్తుంచుకోవాలని, ఇకనైనా ఈ సర్కారు తీరు మారకపోతే.. జనమే కాంగ్రెస్ ను తరిమికొట్టడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.

Next Story