- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం అక్కడుంటే.. హెలికాఫ్టర్ కోసం మంత్రుల పోటీ.. హరీష్ రావు హాట్ కామెంట్స్
మంత్రులు హెలికాఫ్టర్లలో పోటీపడి తిరుగుతున్నారు తప్ప, రైతులకు ధైర్యం చెప్పడం లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) ఎద్దేవా చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మంత్రులు హెలికాఫ్టర్లలో పోటీపడి తిరుగుతున్నారు తప్ప, రైతులకు ధైర్యం చెప్పడం లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన పంట నష్టంపై మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా హరీష్ రావు.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, వానాకాలం రైతుబంధు (Raithu Bandhu) 8వేల కోట్లు ఇవ్వకపోగా.. యాసంగి రైతుబంధు 5వేల కోట్లు మొత్తం 13 వేల కోట్లు ఇవ్వలేదని అన్నారు. రైతు రుణమాఫీ అయ్యింది 45 శాతం అయితే కానిది 55 శాతం అని, అది కూడా పూర్తిగా ఇవ్వలేదని ఆరోపించారు.
అంతేగాక ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షాల వల్ల అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయని, అయినా ప్రభుత్వంలో స్పందన లేదని, నాయకులు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారని మండిపడ్డారు. మంత్రులు అధికారులతో వెళ్లి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు భరోసా ఇవ్వాలి కానీ, మంత్రులు (Ministers) హెలికాఫ్టర్లలో పోటిపడి తిరుగుతున్నారు తప్ప, ఒక్కరు కూడా రైతులకు ధైర్యం చెప్పడం లేదని దుయ్యబట్టారు. ఒకవైపు ప్రకృతి కరునించకపోగా.. మరోవైపు రేవంత్ రెడ్డి వికృత చేష్టల వల్ల కూడా పంటలు దెబ్బతింటున్నాయని విమర్శించారు. నీళ్లు సరిగ్గా రాక కొంత అయితే కరెంట్ సరిగ్గా లేక కొంత మేర పంటనష్టం జరుగుతుందని అన్నారు.
అకాల వర్షాల వల్ల దాదాపు 13 జిల్లాల్లో పంటనష్టం జరిగిందని, కానీ ఇవేమి పట్టనట్టు ముఖ్యమంత్రి జపాన్ (CM Japan Tour) లో తిరుగుతుంటే మంత్రులేమో రైతులంటే పట్టింపు లేకుండా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పంట పెట్టుబడి సమయంలో ఇవ్వాల్సిన రైతుబంధు పంట కోసే సమయం దాటి పోతున్న రైతులకు అందలేదని అన్నారు. తక్షణమే వ్యవసాయ శాఖ మంత్రి (Agriculture Minister), డిప్యూటీ సీఎం (Deputy CM) స్పందించి నష్టపోయిన పంటను అంచనా వేసి ఎకరానికి 20 వేల రూపాయలు పంట నష్టానికి అందించి రైతులను ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.






