కేసు రుజువైతే.. కవిత మళ్ళీ జైలుకే! కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం

by Geesa Chandu |   (  Updated:2024-08-28 17:17:58  IST  )

కేసు రుజువైతే కవిత మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం పేర్కొన్నారు.

కేసు రుజువైతే.. కవిత మళ్ళీ జైలుకే! కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసు రుజువైతే కవిత మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ..కవితను కడిగిన ముత్యం అనడానికి సిగ్గులేదా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో దోపిడికి పాల్పడ్డ కేసీఆర్, హరీష్​రావు, కేటీఆర్ లు కూడా తీహార్ జైలుకు వెళ్లడం పక్కా అని గుర్తు చేశారు. కవిత దేశం కోసం త్యాగం చేసి జైలు కెళ్లినట్లు బీఆర్ఎస్ నాయకులు యాక్షన్ చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసి లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకు పోయిందని గుర్తు చేశారు. లిక్కర్ స్కామ్ లో వంద కోట్లు బయటపడింది నిజమే కదా? అంటూ పేర్కొన్నారు. అద్దె ఇంట్లో ఉన్న కవిత రూ.180 కోట్లతో బంజారాహిల్స్ లో ఇల్లు కట్టింది వాస్తవం కాదా? అంటూ మండిపడ్డారు. రూ.50 కోట్లతో ఇతర దేశాల్లోని ఫర్నిచర్ కోనుగోలు చేశారన్నారు. ఆధారాలన్నీ ఉన్నాయన్నారు. దుబాయ్ లోనూ రూ.500 కోట్లతో ప్లాట్ కొన్నారన్నారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది కూడా వాస్తవమేనన్నారు. హైదరాబాద్ చుట్టూ బినామీల పేరు ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు.

Next Story