దళారులే దందా చేస్తే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్లా?: కవిత

by Prasad Jukanti |   (  Updated:2025-10-22 07:49:01  IST  )

మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ప్రభుత్వంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళారులే దందా చేస్తే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్లా?: కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసిన పాపానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ధ్వజమెత్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మక్క కొనుగోలు కేంద్రాలు (maize procurement Centers) ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా ఆమె పోస్టు పెట్టారు. దళారులే ఏకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కన్నా రూ.400 తక్కువకు మక్కలు కొనుగోలు చేస్తున్నారంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు సమయానికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయలేకపోతోందని, రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల వ్యథలు పట్టించుకోని ఈ ప్రభుత్వానికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Next Story