- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srinivas Goud : ఆ పనిచేస్తే బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయదు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వా(Government)నికి బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) బంపర్ ఆఫర్(Bumper Offer) ఇచ్చారు

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వా(Government)నికి బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) బంపర్ ఆఫర్(Bumper Offer) ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీ రూ.2లక్షల రైతు రుణమాఫీ వంద శాతం(100% Farmer Loan Waiver) పూర్తయిన(Ccompleted)ట్లుగా 33 జిల్లాల కలెక్టర్ల(Collectors of 33 Districts)తో డిక్లరేషన్(Declaration)ఇప్పిస్తే మా పార్టీ రాబోయో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి(Brs Not Contest Local Elections)దూరంగా ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మా సవాల్ ను స్వీకరించే దమ్ముందా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్ లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
రుణమాఫీ అమలు పరిశీలనకు మేం రమ్మన్న పది గ్రామాలకు ప్రభుత్వం వచ్చిన సరే..లేదా మీరు పిలిచిన గ్రామాలకు మమ్మల్ని రమ్మన్నా వస్తామన్నారు. ఆ గ్రామాల్లో వంద శాతం రుణమాఫీ అయినట్లుగా రైతులు చెబితే మా నాయకుడు కేసీఆర్ కు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం పోటీ చేయబోమన్నారు. ఏడాదిగా భూమిలేని రైతులకు రూ.12వేల ఇందిరమ్మ అత్మీయ పథకం అమలు చేయకుండా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని తెరపైకి తెచ్చారని..రైతు భరోసా 15వేలు అని ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు 12వేలు ఇస్తామంటున్నారని అది కూడా ఎంత మందికి ఇస్తారో లెక్కల్లెవని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రైతులతో రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పాలకులు..రైతులకు చేస్తున్న అన్యాయంపై మేం ప్రశ్నిస్తే మాపై విమర్శలు చేస్తున్నారన్నారు.






