- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువుల్లో మట్టి పోస్తే.. హైడ్రాకు సమాచారమివ్వండి
చెరువులలో మట్టి పోస్తున్నవారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోను నంబరు 9000113667 కేటాయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: చెరువులలో మట్టి పోస్తున్నవారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోను నంబరు 9000113667 కేటాయించింది. అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని కోరింది. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో పాటు.. కళాశాలల విద్యార్థులు, స్వచ్చంద సంస్థలు ఇలా అందరూ ఈ క్రతువులో చేతులు కలపాలని హైడ్రా కోరింది.
ఇప్పటి వరకూ 48 కేసులు..
రాత్రీపగలూ నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను పట్టుకుని సంబంధిత వ్యక్తులపై హైడ్రా కేసులు పెట్టింది. ఇందులో లారీ ఓనర్లతో పాటు.. నిర్మాణ సంస్థలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఈ నిఘాను తీవ్రతరం చేసి.. చెరువుల్లో మట్టి నింపుతున్న వాహనదారులతో పాటు.. మట్టి తరలించే కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది. ఇప్పటి వరకు 48 కేసులు నమోదు చేసినట్లు హైడ్రా తెలిపింది.
- Tags
- HYDRA






