- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ నన్ను ఉచ్చులో పెట్టాలని చూస్తే.. అదే ఉచ్చులో కవిత చిక్కుకొక తప్పదు
'సీఎం కేసీఆర్ నన్ను ఉచ్చులో పెట్టాలని చూస్తున్నారు. అదే ఉచ్చులో కవిత చిక్కుకొక తప్పదు' అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : 'సీఎం కేసీఆర్ నన్ను ఉచ్చులో పెట్టాలని చూస్తున్నారు. అదే ఉచ్చులో కవిత చిక్కుకొక తప్పదు' అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. బుధవారం లోటస్ పాండ్ వద్ద మీడియాతో మాట్లాడిన షర్మిల.. ఈ నెల 16న పాలేరులో పార్టీ ఆఫీస్‌కు భూమి పూజ నిర్వహిస్తాం అని తెలిపారు. కవిత అమాయకంగా బతుకమ్మ ఆడుతూ.. ప్రజలను నమ్మించి లిక్కర్ స్కాం చేసిందని విమర్శించారు. ఇక్కడ బతుకమ్మ ఆడుతూ, లిక్కర్ మాఫియా చేసింది సరిపోలేదు అన్నట్టు... దేశం మొత్తం దోచుకునేందుకు బయల్దేరారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బిడ్డ కాకుంటే కవిత పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోయినా కవితకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చారు... శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు ఇవ్వలేదు అని నిలదీశారు.
లిక్కర్ స్కాంలో ఉండి తెలంగాణ పరువు తీసిన వ్యక్తి కవిత.. ఆమె గురించి ఎం మాట్లాడాలి? అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తండ్రి పేరు చెప్పి ఎమ్మెల్సీ పొందిన ఆమె గురించి ఎం మాట్లాడాలన్నారు. పంజాబ్‌లో రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యయంటా..? ఇక్కడ మన రైతులకు ఇవ్వడానికి దిక్కు లేదు. కానీ, పంజాబ్ వెళ్లి ఇచ్చాడట అని షర్మిల సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్కు మించిన రైతు ద్రోహి లేడని విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రంలో తాలిబాన్ల అధ్యక్షుడిగా పాలన చేస్తున్నారన్నారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకున్నాడన్నారు. అసలు కేసీఆర్ తెలంగాణ కోసం రాజకీయాల్లోకి రాలేదని.. కేవలం టీడీపీలో పదవి రానందుకు బయటికి వచ్చి తెలంగాణ కోసం మాట్లాడాడని ఆరోపించారు. మంత్రి పదవి ఇచ్చినప్పుడు చంద్రబాబును కేసీఆర్ దేవుడు అన్నారు కదా అని గుర్తు చేశారు. కేవలం రాజకీయం కోసం బీజేపీ మతంను వాడుకున్నట్టే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ కనుసన్నల్లో పోలీస్ డిపార్ట్మెంట్...
పోలీసులు నా ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ మీదే కేసు వేయడానికి సిద్ధమైనట్లు తెలిపారు. ఏ అధికారంతో నా రైట్స్ నాకు కాకుండా చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ అడుగడుగున పోలీసులను వాడుకుంటున్నారని.. నిన్న హై కోర్టుకు వెళ్లేందుకు కూడా అనుమతి లేదంటూ పోలీసులు నన్ను బయటికీ అడుగు కూడా పెట్టనివ్వలేదంటూ షర్మిల మండిపడ్డారు. పోలీసులపై లీగల్‌గా కోర్టులో కేసు వేస్తాం అని స్ఫష్టం చేశారు. తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ కేసీఆర్ కనుసన్నల్లోకి వెళ్ళిపోయిందన్నారు. కేసీఆర్ పోలీసు డిపార్ట్మెంట్ మర్యాద మొత్తం తీసేశాడని.. పోలీసుల భుజాన తుపాకీ పెట్టీ తనను టార్గెట్ చేశారన్నారు. సంక్రాంతి తర్వాత ఆగిపోయిన దగ్గర నుంచే పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తాం అని షర్మిల స్పష్టం చేశారు. ఇక, డాక్టర్ల సూచన మేరకే తన హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసలు ఏ పార్టీకీ లేని ఆంక్షలు మా పార్టీకి ఎందుకు? అని ప్రశ్నించారు. పోలీసు డిపార్ట్మెంట్ కేసీఆర్ కనుసన్నల్లో వెళ్లిన కనీసం న్యాయవ్యవస్థ అయిన బతికే ఉందని అన్నారు. కేసిఆర్ ఇప్పటికీ అయిన బుద్ది తెచ్చుకొని పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరారు.
ఢిల్లీలో బీఆర్‌ఎస్ ఫ్లెక్సీల తొలగింపుపై మాట్లాడిన షర్మిల.. పొట్టోడిని పొడుగొడు కొడితే పొడుగొన్ని పోచమ్మ కొట్టిందంట అనే సామెత చెప్పారు. కేసీఆర్ ఇక్కడ చేసిన పనికి ఆయనకు ఢిల్లీలో తగిలిందన్నారు. నిన్న పాదయాత్రకు హై కోర్టు అనుమతి ఇస్తూ.. కేసీఆర్ సర్కారుకు మొట్టికాయలు వేసిందని సెటైర్లు వేశారు. కేసీఆర్ మా పాదయాత్రను అడ్డుకోవడానికి అడుగడుగునా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 3500 కి.మీ ప్రశాంతంగా పాదయాత్ర సాగింది. 3500 కిమీ. దాటాక కేసీఆర్ గుండాలు మాపై దాడి చేశారని అన్నారు. ఇక, ప్రధాని ఫోన్ కాల్ అనేది మా పర్సనల్ లైఫ్‌కి సంబంధించినది అన్ని చెప్పాల్సిన అవసరం లేదు కదా అని అన్నారు. మేము పబ్లిక్ సర్వీస్‌లో మాత్రమే ఉన్నాం.. అంత మాత్రాన మమ్మల్ని పబ్లిక్ టాయ్లెట్‌లా చూడొద్దు అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.
Also Read....
- Tags
- YS Sharmila
- YSRTP






