- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరీశ్ రావును ఓడిస్తే మంత్రి పదవి.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్
బీఆర్ఎస్‍పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో మేము గెలవడం ఖాయం అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 2029లోనూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రాబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో కాంగ్రెస్ గెలవాలని సిద్దిపేటలో గెలిచి ఎమ్మెల్యేను మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించిన రైతుఉత్సవాల సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్, హరీశ్ రావు టార్గెట్‍గా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడింది. కానీ ప్రజలు బీఆర్ఎస్‍కు అధికారం ఇచ్చారు. 2023లో మాకు అధికారం ఇచ్చారు. 2029 మళ్లీ మాకే అధికారం ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఒక్కసారి అవకాశం ఇవ్వండి:
సిద్దిపేటను1984 నుంచి 2029 ఒకే కుటుంబం పాలిస్తోందని ఒక్కసారి ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలని సీఎం అన్నారు. మార్పు చేసి చూస్తే మంచి జరుగుతుందో మీరే చూడాలన్నారు. మల్లన్నసాగర్, ఏటిగడ్డకిష్టాపూర్ వంటి సమస్యలు వచ్చిన నాడు మేము నిలబడ్డామని ఈ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించినట్లు మేము వ్యవహరించడం లేదన్నారు. నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు నిర్వాసితులను ఒప్పించాకే పనులు ప్రారంభించామన్నారు. మూసీలో మీ మొసలి కన్నీరు ప్రజలు అర్థం చేసుకోవడం లేదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం, ప్రజల మేలు కోసం మాట్లాడాలి. కానీ ఏమి జరగవద్దు వీళ్లను ఏమీ చేయనివ్వొద్దు అంటే అది ప్రజల పట్ల పగతో వ్యవహరించినట్లేనన్నారు. ప్రతిపక్షం బాధ్యత ఇది కాదన్నారు. అభివృద్ధి జరగకుండా అడ్డం పడుకుంటామంటే ఊరుకుంటామా? ముఖ్యమంత్రినై సిద్ధిపేటకు రాలేదా? 2029లో మళ్లీ గెలిచి సిద్ధిపేటకు వస్తామన్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుతో భిన్నాభిప్రాయాలు:
ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత అభివృద్ధిపైనే నా దృష్టి అని సీఎం చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుతో రాజకీయంగా తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ వారి నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ మా నిజాయితీ నిరూపించుకున్నామన్నారు. నర్మెట్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు నేను ముఖ్యమంత్రి అయ్యాకే ప్రారంభమయ్యాయి. కావాలనుకుంటే నేను ఈ ఫ్యాక్టరీని కొడంగల్ కు తీసుకువెళ్లకపోయేవాడినా? కానీ ఇక్కడి రైతుల కోసం ఇక్కడే నిర్మించాం. ఆ తర్వాతే తన నియోజకవర్గానికి ఒకటి ఇవ్వమని మంత్రులను కోరుతున్నానని చెప్పారు. నేను వివక్ష చూపడంలేదన్నారు. వివక్ష గురించి మాట్లాడితే 2014 నుంచి 2023 వరకు కొడంగల్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చారు? మేమొచ్చాక ఈ ప్రాంతానికి నేను ఎన్ని నిధులు ఇచ్చామో లెక్కలు తీద్దామన్నారు. వివక్ష మా ఇంట వంట లేదన్నారు. బీఆర్ఎస్ నేతలను చూసి చూసి ప్రజలను వేయమన్నారు. పేదల కోసం పని చేస్తాం తప్ప రాజకీయ నాయకుల కోసం మేము పని చేయామన్నారు. నాకు వ్యవసాయం తెలుసని చీడపురుగులకు ఏ మందు వేయాలో తనకు బాగా తెలుసన్నారు.






