- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy: డీలిమిటేషన్ పై మరోసారి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కిషన్ రెడ్డి డీలిమిటేషన్ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: డీలిమిటేషన్ (Delimitation) చేస్తే సీట్లు తగ్గుతాయనేది ప్రతిపక్షాల దుష్ప్రచారం మాత్రమే అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. పునర్విభజనకు సంబంధించి 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి విధానాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై కొత్త విధానం రాలేదన్నారు. శనివారం రైల్వే ఎంజీ అరుణ్ కుమార్ జైన్ తో కలిసి కిషన్ రెడ్డి బేగంపేట్ రైల్వే స్టేషన్ (Begumpet Railway Station) డెవలప్మెంట్ పనులను పరిశీలించారు.
మహిళ ఉద్యోగులే ఉండేలా చూస్తాం:
రాబోయే ఐదేళ్లలో తెలంగాణలోని రైల్వేస్టేషన్ల స్వరూపమే మారబోతున్నదని కిషన్ రెడ్డి చెప్పారు. బేగంపేట రైల్వే స్టేషన్ లో అందరూ మహిళా ఉద్యోగులే ఉండేలా చూస్తామన్నారు. వచ్చే ఏడాది నాటికి సికింద్రాబాద్ స్టేషన్ పనులు పూర్తవుతాయని ప్రస్తుతం శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. రూ. య26.55 కోట్లతో మొదటి విడత పనులు జరుగుతున్నాయి. మరో రూ. 12 కోట్లతో రెడో విడత పనులు పూర్తి చేస్తామన్నారు. గతంలో రైల్వే స్టేషన్ల పరిస్థితి అధ్వానంగా ఉండేదని ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ ప్రొగ్రామ్ ద్వారా స్వచ్ఛ రైల్వే స్టేషన్ పేరుతో వినూత్న మార్పులను తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో రైల్వే ట్రాక్ ల దగ్గర ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సికింద్రాబాద్ కు 5 వందే భారత్ ట్రైన్లు వచ్చాయన్నారు. చర్లపల్లితో పాటు సికింద్రబాద్ రైల్వే స్టేషన్ల వద్ద అప్రోచ్ రోడ్లు బాగుండాలన్నారు. దీనికి భూసేకరణ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని దానిని వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జంటనగరాల్లో ఉన్న రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణ కోసం ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశామన్నారు. ఇందుకు ప్రధాని అంగీకరించారన్నారు.
తమిళ సినిమాలు హిందీలో డబ్ అవ్వట్లేదా?
త్రిభాషా విధానం ఈ దేశంలో కొత్తదేమీ కాదని కిషన్ రెడ్డి అన్నారు. ఏ ఒక్కరిపై బలవంతంగా హిందీని (Hindi Language Dispute) రుద్దే ప్రయత్నం చేయడం లేదని న్నారు. ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఏ చేశారో చెప్పి తమిళనాడు ప్రజలకు ఓట్లు అడగాలని అంతే తప్ప భాష పేరుతో దేశాన్ని విభజించాలని చూడటం సరికాదన్నారు. తమిళ భాషలో తీసిన సినిమాలు హిందీలో డబ్ చేసి నిర్మాతలు లాభాలు పొందుతున్నారు. వాళ్లకా లాభాలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు.
READ MORE ...
అసెంబ్లీలో మీరు చేయాల్సిన పని అదే.. BJP ఎమ్మెల్యేలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం






