బొగ్గుల శ్రీనివాస్ మృతదేహాంపై గాయాలు.. పోలీసుల ఫిర్యాదులో సంచలన విషయాలు

by Prasad Jukanti |   (  Updated:2026-02-15 12:25:49  IST  )

‘పవన్ కళ్యాణ్ హఠావో - పాలిటిక్స్ బచావో’ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన మలుపు. పాలేరు జలాశయంలో కారు దూసుకెళ్లిన ఘటనపై కుటుంబ సభ్యులు హత్య ఆరోపణలు చేశారు. తల, ముఖంపై గాయాలపై ఫిర్యాదు చేయగా, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

బొగ్గుల శ్రీనివాస్ మృతదేహాంపై గాయాలు.. పోలీసుల ఫిర్యాదులో సంచలన విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 'పవన్ కల్యాణ్ హఠావో - పాలిటిక్స్ బచావో' పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ (Boggula Srinivas) అనుమానాస్పద మృతి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆయన ప్రయాణిస్తున్న కారు శనివారం ఉదయం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయంలోకి దూసుకెళ్లింది. ఈఘటనలో బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందగా ఈ ప్రమాదంపై తాజాగా ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది. తమ సోదరుడిని హత్య చేసి యాక్సిడెంట్‍గా చిత్రీకరించారని బొగ్గుల శ్రీనివాస్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ సోదరుడి తల, ముఖం, ఎడమ చేయిపై బలమైన గాయాలు ఉన్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్‍ను కొట్టి చంపినట్లు కనబడుతోందని పేర్కొన్నారు. వెంటనే ఈ మృతిపై విచారణ చేయాలని శ్రీనివాస్ సోదరుడు బొగ్గుల అబ్దులయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సీసీ టీవీ ఫుటేజ్‍ల పరిశీలన:

బొగ్గుల శ్రీనివాస్ మృతిపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాలేరు వద్ద ఉన్న టోల్ ప్లాజా సీసీ ఫుటేజ్‍తో పాటు వారి కారు ప్రయాణించిందని అనుమానిస్తున్న సమీప గ్రామాలు, రహదారిపై ఉన్న వ్యాపారుల సీసీ కెమెరాల పరిశీలిస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్ పై శ్రీనివాస్ రాసిన పుస్తకం వివాదాస్పదం కావడం, గతంలోనే ఆయన అనేక బెదిరింపులను ఎదుర్కొన్నారు. కాగా ఈ ప్రమాదం తర్వాత కారులో నుంచి డ్రైవర్ పారిపోయారని స్థానిక మత్స్యకారులు చెప్పడంతో శ్రీనివాస్ మరణం మిస్టరీగా మారింది. పోలీసుల దర్యాప్తులో ఏం తేలబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది.

"పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో" పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి

Next Story