వైద్యరంగంలో అధునాతన సిరాలజీ పద్ధతులు ఎంతో కీలకం: ఐసీఎంఆర్ సైంటిస్ట్ స్వాతి కులకర్ణి

by Ajay Maddhiboyina |

రక్తమార్పిడి, రోగి సంరక్షణలో యాంటీ బాడీస్క్రీనింగ్, యాంటీ బాడీ ఐడెండిఫికేషన్ వంటి అధునాతన సిరాలజీ పద్ధతులు అత్యంత ముఖ్యమైనవని ఐసీఎంఆర్ సైంటిస్ట్ డా. స్వాతి కులకర్ణి పేర్కొన్నారు. రక్త మార్పిడి భద్రత, రోగి సంరక్షణలో యాంటీబాడీ స్క్రీనింగ్, యాంటీబాడీ ఐడెంటిఫికేషన్, అడ్సార్ప్షన్, ఎల్యూషన్ వంటి అధునాతన సిరాలజీ పద్ధతులు అత్యంత కీలకమైనవని ఆమె పేర్కొన్నారు.

వైద్యరంగంలో అధునాతన సిరాలజీ పద్ధతులు ఎంతో కీలకం: ఐసీఎంఆర్ సైంటిస్ట్ స్వాతి కులకర్ణి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రక్తమార్పిడి, రోగి సంరక్షణలో యాంటీ బాడీస్క్రీనింగ్, యాంటీ బాడీ ఐడెండిఫికేషన్ వంటి అధునాతన సిరాలజీ పద్ధతులు అత్యంత ముఖ్యమైనవని ఐసీఎంఆర్ సైంటిస్ట్ డా. స్వాతి కులకర్ణి పేర్కొన్నారు. రక్త మార్పిడి భద్రత, రోగి సంరక్షణలో యాంటీబాడీ స్క్రీనింగ్, యాంటీబాడీ ఐడెంటిఫికేషన్, అడ్సార్ప్షన్, ఎల్యూషన్ వంటి అధునాతన సిరాలజీ పద్ధతులు అత్యంత కీలకమైనవని ఆమె పేర్కొన్నారు. ఈ పద్ధతులు పేషెంట్ బ్లడ్ మేనేజ్‌మెంట్‌లో ఖచ్చితమైన రక్త గ్రూప్ ఎంపిక, రక్త మార్పిడి ప్రతిచర్యల నివారణలో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు.

డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఇమ్యునో- హీమటాలజీ, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన అడ్వాన్స్‌డ్ రెడ్ సెల్ సిరాలజీ అనే అంశంపై నిమ్స్ లో బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు యాంటీబాడీ స్క్రీనింగ్, ప్యానెల్ ఇంటర్‌ప్రిటేషన్, ఎల్యూషన్, అడ్సార్ప్షన్, కంపాటిబిలిటీ టెస్టింగ్ వంటి నాలుగు ప్రాక్టికల్ సెషన్లు జరిగాయి. వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారికి టెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి రెండు క్రెడిట్ అవర్స్ మంజూరయ్యాయి.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ప్రోగ్రాం ద్వారా రిసెర్చ్ కెపాసిటీ స్ట్రెంగ్తెనింగ్ పై కూడా అవగాహన కల్పించారు. భవిష్యత్తులో రక్త సంబంధిత పరిశోధనలకు, క్లినికల్ డయగ్నస్టిక్స్‌లో కొత్త పద్ధతుల అభివృద్ధికి ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు దోహదం చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఎయిమ్స్ వైద్యులు డా. అరుణ్ ఆర్, ఈఎస్ఐసీ హాస్పిటల్ వైద్యులు డా.చుంచు శ్రీనివాస్, నిమ్స్ ఇమ్యునో-హీమటాలజీ బ్లడ్ సెంటర్ ప్రొఫెసర్ డా.బోనగిరి శాంతి, డా. వుజ్జిని సుధీర్ కుమార్, అదనపు ప్రొఫెసర్ డా. మురళీ కృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్ డా. మహేష్ కుమార్, డా. సుధా రంగనాథన్, నిమ్స్ బ్లడ్ సెంటర్ సిబ్బంది బిడుగు శేఖర్, వెంకటరత్నం, పద్మజా, చిరంజీవి, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు మరియు సహాయక సిబ్బంది పాల్గొన్నారు.

Next Story