- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విదేశాలకు తాటిముంజలు.. నల్గొండ యువకుడి ఐడియా అదుర్స్
ఎండాకాలం వచ్చిందంటే కొబ్బరిబోండాలతో పాటూ తాటిముంజలు కనిపిస్తుంటాయి. గ్రామాల్లో అయితే ఇవి ఫ్రీగానే దొరుకుతాయి.

దిశ, వెబ్ డెస్క్: ఎండాకాలం వచ్చిందంటే కొబ్బరిబోండాలతో పాటూ తాటిముంజలు కనిపిస్తుంటాయి. గ్రామాల్లో అయితే ఇవి ఫ్రీగానే దొరుకుతాయి. పట్టణాలలో అయితే రోడ్ల పక్కన అమ్ముతుంటారు. ఎండాకాలంలో ఇవి తింటే శరీరానికి చల్లదనం అని పెద్దలు చెబుతుంటారు. తినగా చల్లగా తియ్యగా ఉండే తాటి ముంజలు చాలా మందికి ఇష్టం. అయితే ఇప్పుడు ఇవి విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన మువ్వా రమేశ్ అనే యువ పారిశ్రామికవేత్త వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. గుడిమాల్కాపూర్ ఇండస్ట్రీయల్ పార్కులోని తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్ ద్వారా శ్వేత తెలుగు ఫుడ్స్ పేరుతో అమెరికా, రష్యాతో పాటు దాదాపు 20 దేశాలకు తాటిముంజలను ఎగుమతి చేస్తున్నారు.
ప్రతి రెండు రోజులకు ఒకసారి 100 నుండి 300 గ్రాముల ప్యాక్ లలో దాదాపు 1500 కేజీలను ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని గీతకార్మికుల నుండి వీటిని స్వీకరించి ఆధునిక పద్దతిలో ప్యాకింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తాటిముంజలు ఎగుమతి చేయడం ద్వారా 350 మందికి ఉపాధి కూడా లభిస్తున్నట్టు తెలుస్తోంది. తాటి ముంజల్లో విటమిన్లు, ఖనిజలవణాలు ఉండటంతో పాటూ సమ్మర్‌లో డీహైడ్రైషన్ బారిన పడకుండా ఇవి కాపాడుతాయి. కాబట్టి విదేశాల్లో వీటికి భలే గిరాకీ ఉంది. విదేశాలకు తాటి ముంజలు ఎగుమతి అవ్వడంతో కేవలం అక్కడివారికే కాకుండా మన దగ్గర నుండి చదువుల కోసం ఉద్యోగాల కోసం వెళ్లినవారు కూడా వీటిని మిస్ అవ్వకుండా ఉంటారు.






