- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసు పహారాలో ఇబ్రహీంపట్నం.. కాసేపట్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
రెండు సార్లు వాయిదా పడిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక భారీ పోలీసు బందోబస్తు నడుమ ఇవాళ జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. గతంలో కాంగ్రెస్ (Congress), బీఆర్‌ఎస్ (RBS) వర్గాల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ ఎన్నికను, తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తిరిగి ఇవాళ నిర్వహిస్తోంది. ఈ మేరక ఇవాళ ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేయననున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం కౌన్సిలర్ల సంఖ్యను బట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి 13 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది కౌన్సిలర్లు, బీజేపీ (BJP) నుంచి ఒకరు, ఇండిపెండెంట్ కౌన్సిలర్‌గా ఒకరు విజయం సాధించారు.
సంఖ్యాపరంగా బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ, గతంలో జరిగిన ఘర్షణలు, రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ ఎన్నిక అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్‌లోని 163 సెక్షన్ అమలులో ఉండే అవకాశం ఉంది. కేవలం అనుమతి ఉన్నవారిని మాత్రమే కార్యాలయం లోపలికి అనుమతిస్తున్నారు.






